FD Safety Guide : బ్యాంక్ దివాలా తీస్తే.. మీ FD డబ్బు ఏం అవుతుంది? ఫుల్ రికవరీ అవుతుందా? అసలు నిజం ఇదే!
FD Safety Guide : ఒకే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేశారా? సేవింగ్స్ అకౌంటులో మీ డబ్బు ఉంచితే అది సురక్షితమేనా? ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేయాలి? ఎంత మొత్తంలో బ్యాంకులో ఉండాలి? బ్యాంకు దివాలా తీస్తే మీ డబ్బు రికవరీ అవుతుందా? లేదా ఇప్పుడు తెలుసుకుందాం..
FD Safety Guide ( Image Credit : Gemini AI )
- ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు ఈ రూల్ తెలుసుకోండి
- ఒకే బ్యాంకులో ఎక్కువ మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొద్దు
- మీరు ఎఫ్ డీ పెట్టిన బ్యాంకు దివాలా తీస్తే మొత్తం డబ్బులు రికవరీ అవుతాయా?
- ఎంత FD చేస్తే డబ్బు రికవరీ అవుతుంది? బీమా ఎంత వర్తిస్తుంది?
FD Safety Guide : మీరు ఏ బ్యాంకులోనైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? ఎన్ని FD అకౌంట్లు ఉన్నాయి? ఒకే బ్యాంకులో ఎఫ్డీలు చేయొచ్చా? అలా చేస్తే ఏమైనా రిస్క్ ఉంటుందా? ఒకవేళ మీరు ఎఫ్డీ చేసినా దివాలా తీస్తే మీ డబ్బు ఏమౌతుంది? తిరిగి మీ చేతికి వస్తుందా? ఇలాంటి అనేక అనుమానాలు ఉంటాయి.
వాస్తవానికి, మీరు ఒకే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) లేదా సేవింగ్స్ అకౌంట్లలో ఎక్కువ డబ్బులు ఉంచినట్టుయితే ఈ వార్త మీకోసమే.. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లను అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. కానీ, బ్యాంకులు దివాలా తీసిన సందర్భంలో మీ మొత్తం డబ్బు సురక్షితంగా ఉండదని గమనించాలి.
ఎంత డబ్బు సురక్షితం? :
భారత్లో బ్యాంకు డిపాజిట్లకు DICGC ద్వారా భీమా కల్పిస్తారు. ఈ బీమా గరిష్టంగా రూ. 5 లక్షలకు పరిమితంగా ఉంటుంది. ఈ కవరేజీ సేవింగ్స్ అకౌంట్లు, కరెంట్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీలను (RDs) కవర్ చేస్తుంది. మీకు ఒకే బ్యాంకులో మొత్తం రూ. 10 లేదా 12 లక్షలు ఉంటే అందులో కేవలం రూ. 5 లక్షలు మాత్రమే సురక్షితంగా ఉంటాయి. మిగిలిన మొత్తం రిస్క్ లో ఉన్నట్టే..
ఒకే బ్యాంకులో ఎక్కువ FDలు చేయొద్దు :
చాలామంది ఒకే బ్యాంకులో తమ డబ్బును వేర్వేరు FDలలో ఎక్కువగా పెట్టడం వల్ల మరింత సురక్షితంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇందులో నిజం లేదు. మీకు రూ. 10 లక్షల ఒక FD ఉన్నా లేదా ఒక్కొక్కటి రూ. 2 లక్షల చొప్పున 5 FDలు ఉన్నా అవన్నీ ఒకే బ్యాంకులో ఉంచితే మొత్తం బీమా కవరేజ్ కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఉంటుంది. మిగిలిన మొత్తం రికవరీ అవ్వడం కష్టం. బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియపై ఆధారపడి కొంత వస్తుంది లేదంటే పూర్తిగా నష్టం కూడా రావొచ్చు.
మీ FD రూ. 5 లక్షల కన్నా ఎక్కువగా ఉంటే.. ఆ డబ్బును వేర్వేరు బ్యాంకులలో పెట్టుబడిగా పెట్టొచ్చు. ఉదాహరణకు.. మీ వద్ద రూ. 5 లక్షలు ఉంటే బ్యాంక్ Aలో రూ. 5 లక్షలు.. బ్యాంక్ Bలో రూ. 5 లక్షలను బ్యాంక్ Cలో ఉంచండి. ఇలా మొత్తం డబ్బు బీమా పరిధిలోకి వస్తుంది.
- ఫ్యామిలీ పేరు మీద కూడా భద్రతను పెంచుకోవచ్చు
- మీరు వేర్వేరు కుటుంబ సభ్యుల పేర్ల మీద FDలను ఓపెన్ చేసి కూడా సెక్యూరిటీ పెంచుకోవచ్చు.
- మీ పేరు మీద రూ. 5 లక్షలు
- జీవిత భాగస్వామి పేరు మీద రూ. 5 లక్షలు
- జాయింట్ అకౌంటులో రూ. 5 లక్షలు
- ప్రతి అకౌంటుకు ప్రత్యేక బీమా కవరేజీ లభిస్తుంది.
అన్ని బ్యాంకులూ ఒకేలా సురక్షితం కాదు. చిన్న బ్యాంకులు లేదా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. కానీ, అందులో కొద్దిగా హై రిస్క్ ఉండవచ్చు. అందుకే ఈ బ్యాంకులలో రూ. 5 లక్షల కన్నా ఎక్కువ ఫిక్స్ డ్ డిపాజిట్ చేయొద్దు. ఒకే బ్యాంకులో రూ. 5 లక్షలకు మించి ఎక్కువ FD చేస్తే బ్యాంక్ దివాలా తీసినప్పుడు కేవలం రూ. 5 లక్షల వరకు మాత్రమే గ్యారంటీ వస్తుంది.
