Flex Fuel Vehicles: మొత్తం ఇండియాలో E22, E25, E27, E30 నుంచి E85 వరకు ఏ పెట్రోల్ అయినా నడిచే వాహనాలివే..
Flex Fuel Vehicles: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. ఇప్పటి వరకు వీటి మీద కూడా కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీ ఇక నుంచి తీసేస్తారు.
Flex Fuel Vehicles Run on E22 to E85 Petrol Ethanol Across India
Flex Fuel Vehicles in India: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. E22, E25, E27, E30 మోడల్ పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. అంటే, ఈ పెట్రోల్ కొట్టించుకుంటే ఆ పెట్రోల్ మీద కొంత రేటు తగ్గుతుందన్నమాట. ఇప్పటి వరకు వీటి మీద కూడా కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీ ఇక నుంచి తీసేస్తారు.
అసలు E22, E25, E27, E30 అంటే ఏంటి?
దేశంలో కాలుష్య నివారణ కోసం ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకోసం పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతారు. ఆ ఇథనాల్ శాతం ఎంత కలిపితే దాన్ని ఆ పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి 22 శాతం ఇథనాల్, 78 శాతం పెట్రోల్ కలిస్తే అది E22 పెట్రోల్ అన్నమాట.
- E 25= 25శాతం ఇథనాల్, 75 శాతం పెట్రోల్
- E 27 = 27శాతం ఇథనాల్, 73 శాతం పెట్రోల్
- E 30 = 30శాతం ఇథనాల్, 70 శాతం పెట్రోల్
ప్రస్తుతం మనం వాడుతున్నది E20 పెట్రోల్. ఈ మధ్య కాలంలో మోటార్ కంపెనీలు కూడా ఇథనాల్ బ్లెండింగ్ ఎంత పెరిగినా తట్టుకోదగిన స్థాయిలో ఇంజిన్లను తయారు చేస్తున్నారు. అంటే E85 వాహనాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వాటిని ఫ్లెక్స్ ఫ్యూయర్ వాహనాలు అంటారు.
Also Read : భారీగా పడిపోతున్న బంగారం ధర.. వరుసగా రెండోరోజు ఢమాల్.. రూ.లక్షకు చేరుతుందా? నిపుణులు ఏం చెప్పారంటే..
దేశంలో ఈ రకం పెట్రోల్ తో నడిచే వాహనాలు ఏంటి?
- మారుతి సుజుకి వాగనార్ ఫ్లెక్స్ ఫ్యూయల్
- హీరో స్ల్పెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్
- హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్
- హోండా సీబీ300 ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్
- సుజుకి జిక్సర్ ఎస్ ఎఫ్ ఫ్లెక్స్ ఫ్యూయల్
పైన చెప్పిన వాహనాలు మీ దగ్గర ఉంటేనే మీరు E22, E25, E27, E30 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌తో అయినా నడిపించవచ్చు.
