Flipkart Big Billion Days : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ. 10వేల లోపు ధరలో కొత్త స్మార్ట్ టీవీలు.. ఏ టీవీ కొంటారో కొనేసుకోండి!
Flipkart Big Billion Days : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 10వేల లోపు ధరలో టాప్ 3 కొత్త స్మార్ట్ టీవీలు 65శాతం తగ్గింపుతో లభ్యమవుతున్నాయి.

Flipkart Big Billion Days
Flipkart Big Billion Days : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభ సేల్ మొదలైంది.. ఈ సేల్ సందర్భంగా కొత్త స్మార్ట్ టీవీలపై 65శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు రూ. 10వేల బడ్జెట్ లోపు బెస్ట్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. టాప్ 3 స్మార్ట్ టీవీలకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
స్మార్ట్ టీవీలు 32 అంగుళాల సైజులో ఉంటుంది. మీరు QLED HD డిస్‌ప్లే కలిగి ఉంది. కచ్చితమైన (Flipkart Big Billion Days) కలర్ ఆప్షన్లు, కాంట్రాస్ట్‌తో అద్భుతమైన వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఏడాది వారంటీతో వస్తాయి. సెప్టెంబర్ 2025లో ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్ టీవీ ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
1. మోటోరోలా స్మార్ట్ గూగుల్ టీవీ (32 అంగుళాలు) :
మోటోరోలా 32 అంగుళాల స్మార్ట్ గూగుల్ టీవీ QLED HD డిస్ ప్లే ప్యానెల్‌తో వస్తుంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్ సామర్థ్యం, 8GB స్టోరేజీ మెమరీతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీతో 40W అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లు ఉంటాయి. ఈ స్మార్ట్ టీవీలో డాల్బీ ఆడియోను పొందవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ HDR10తో ఇష్టమైన షో చూడవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ టీవీ 5.0 కూడా యాక్సస్ చేయొచ్చు. 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుత ధర దాదాపు రూ. 26,999 ఉంటుంది. కానీ, 65శాతం భారీ తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 9,199కు పొందవచ్చు.
2. రియల్‌మి టెక్‌లైఫ్ (32 అంగుళాలు) :
రియల్‌మి టెక్‌లైఫ్ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. సినిమాటిక్ సరౌండ్ సౌండ్‌తో 26W డౌన్-ఫైరింగ్ స్పీకర్ కలిగి ఉంది. మీరు 4K UHD రిజల్యూషన్, వివిడ్ పిక్చర్ మోడ్‌తో అల్ట్రా-వివిడ్ విజువల్స్ అందిస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ 16.78 బిలియన్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. స్టాండర్డ్, డైనమిక్, సినిమా, లో బ్లూ, ఫిల్మ్‌మేకర్, ఇష్యూ, గేమ్, యూజర్‌లతో ఈ హై-డెఫినిషన్ టీవీలో 8 పిక్చర్ మోడ్‌లలో చూడవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి టెక్‌లైఫ్ స్మార్ట్ టీవీ ప్రస్తుత ధర దాదాపు రూ. 23,999 ఉంటుంది. కానీ, 63శాతం ధర తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 8,699కు ఇంటికి తెచ్చుకోవచ్చు.
3. ఇన్ఫినిక్స్ HD రెడీ LED స్మార్ట్ లైనక్స్ టీవీ (32 అంగుళాలు) :
ఇన్ఫినిక్స్ HD రెడీ LED స్మార్ట్ లైనక్స్ టీవీ స్లిమ్ బెజెల్ డిజైన్‌తో వస్తుంది. ప్రీమియం ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంది. 250 నిట్‌ల వరకు సూపర్ బ్రైట్ ప్యానెల్‌తో హై-డెఫినిషన్ డిస్‌ప్లేను అందిస్తుంది. క్రిస్టల్ క్లియర్ వోకల్స్, డీప్ బాస్ 16W స్పీకర్ కూడా పొందవచ్చు. స్మార్ట్ టీవీ 512MB ర్యామ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కంపెనీ కాంపాక్ట్ రిమోట్ కూడా అందిస్తుంది. బేస్ కీ, డెడికేటెడ్ హాట్ కీలతో స్లిమ్ డిజైన్ కలిగి ఉంది.
ఈ స్మార్ట్ టీవీలో 2 HDMI, 1 USB, Wi-Fi, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, RJ45 పోర్ట్ వంటి మల్టీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్ఫినిక్స్ HD రెడీ LED స్మార్ట్ లైనక్స్ టీవీ ప్రస్తుత ధర దాదాపు రూ. 16,999 ఉంటుంది. కానీ, 57శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 7,299కు కొనుగోలు చేయవచ్చు.