Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 60 Pro : మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ధర తగ్గింది. వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్ తగ్గింపు ధరకే ఎలా పొందాలంటే?

Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 60 Pro

Updated On : September 16, 2025 / 6:31 PM IST

Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ ధర భారీగా తగ్గింది. సెప్టెంబర్ 23న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. అంతకన్నా ముందే ఈ మిడ్-రేంజ్ ఫోన్ ధర తగ్గింది. ఈ సేల్ సమయంలో (Motorola Edge 60 Pro) ఈ మోటోరోలా వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్ గరిష్ట రిటైల్ ధర (MRP) కన్నా రూ.5వేల వరకు తక్కువ ధరకు లభిస్తుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో డిస్కౌంట్ :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 3 స్టోరేజ్ వేరియంట్లు, 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

స్టోరేజీ వేరియంట్లు :
8 జీబీ ర్యామ్ + 256 జీబీ
12 జీబీ ర్యామ్ + 256 జీబీ
16 జీబీ ర్యామ్ + 512 జీబీ

కలర్ ఆప్షన్లు :
పెంటాటన్ బ్లూ
పెంటాటన్ షాడో
పెంటాటన్ గ్రేప్

మోటోరోలా ప్రారంభ ధరలు వరుసగా రూ.29,999, రూ.33,999, రూ.37,999 కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.36,999కు అందుబాటులో ఉంది. రాబోయే సేల్‌లో మోటోరోలా ఫోన్ ప్రారంభ ధర రూ.5వేల వరకు తగ్గింపుతో కేవలం రూ.24,999కి లభిస్తుంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. ఈ తేదీ నాటికి 21వ విడత రూ. 2వేలు పడొచ్చు. వెంటనే ఈ పని పూర్తి చేయండి..!

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు :
ఈ మిడ్-రేంజ్ ఫోన్ 6.7-అంగుళాల సూపర్ HD క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, 1.5K (2712 x 1220 పిక్సెల్స్) రిజల్యూషన్‌ కలిగి ఉంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కలిగి ఉంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 16GB వరకు ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

కంపెనీ 3 ఏళ్ల OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ పవర్‌ఫుల్ 6000mAh బ్యాటరీతో వస్తుంది. 90W వైర్డు, 15W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్టు ఇస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్‌ ఉన్నాయి.

50MP మెయిన్ సెన్సార్
50MP అల్ట్రావైడ్ సెన్సార్
10MP టెలిఫోటో లెన్స్
మల్టీస్పెక్ట్రల్ 3-ఇన్-1 లైట్ సెన్సార్
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మోటోరోలా ఫోన్ 50MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.