Flipkart Big Billion Days Sale : బిగ్ అలర్ట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగుస్తోంది.. ఆ తేదీ వరకు మాత్రమే.. కొత్త ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగియనుంది. ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే సేల్ ముగిసేలోగా ఇప్పుడే కొనేసుకోండి..

Flipkart Big Billion Days Sale : బిగ్ అలర్ట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్ ముగుస్తోంది.. ఆ తేదీ వరకు మాత్రమే.. కొత్త ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. డోంట్ మిస్!

Flipkart Big Billion Days Sale

Updated On : September 30, 2025 / 2:18 PM IST

Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, వెంటనే కొనేసుకోవడం బెటర్.. ఎందుకంటే.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అతి త్వరలో ముగియబోతుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ ఎండ్ డేట్ ప్రకటించింది. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ సేల్ ప్రస్తుతం ప్లాట్‌ఫామ్‌లో కొనసాగుతోంది.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, వీఐపీ కస్టమర్లకు 24 గంటల ముందస్తుగా (Flipkart Big Billion Days Sale) అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌వాచ్‌లు, రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌లు, హోం అప్లియన్సెస్, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లతో సహా అనేక కేటగిరీలలో కొనుగోలుదారులకు భారీ తగ్గింపులను అందిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎండ్ డేట్, బ్యాంక్ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ అధికారిక మైక్రోసైట్‌ను అప్‌డేట్ చేసింది. దీని ప్రకారం.. ఈ సేల్ వచ్చే నెల ప్రారంభంలో అక్టోబర్ 2న ముగుస్తుందని వెల్లడించింది. ఈ సేల్ సమయంలో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కస్టమర్లకు అదనంగా 10 శాతం తగ్గింపును అందిస్తుంది.

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా మోడళ్లతో సహా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Read Also : Samsung Galaxy A55 5G : అమెజాన్‌లో బ్రహ్మాండమైన ఆఫర్.. ఈ శాంసంగ్ గెలాక్సీ A55 5Gపై బిగ్ డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

కొత్త ఐఫోన్ 16 సిరీస్ ప్రస్తుత ధరలివే :

  • ఐఫోన్ 16 : రూ. 53,999
  • ఐఫోన్ 16 ప్రో : రూ. 77,999
  • ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ : రూ. 99,499
    ఫ్లిప్‌కార్ట్ కూడా శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ స్నాప్‌డ్రాగన్ వేరియంట్‌ ధర రూ.38,999కి, గూగుల్ పిక్సెల్ 9 మోడల్ ధర రూ.52,999కి అందిస్తోంది.

మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ :
మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై కూడా సేల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

  • వివో T4R : రూ. 17,499
  • ఒప్పో K13 : రూ. 14,999
  • వివో T4 ప్రో : రూ. 25,499

ఈ-కామర్స్ దిగ్గజం మోటోరోలా స్మార్ట్‌ఫోన్ల ధరను కూడా తగ్గించింది.

  • మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో : రూ. 24,999
  • మోటో G96 : రూ. 14,999
  • మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ : రూ. 19,999