Flipkart GOAT Sale : ఆఫర్ అదిరింది గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే.. ఈ మోటోరోలా ఫోన్ జస్ట్ రూ. 10వేలు మాత్రమే..!

Flipkart GOAT Sale : మోటోరోలా ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త GOAT సేల్ ద్వారా కేవలం రూ. 10వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.

Flipkart GOAT Sale : ఆఫర్ అదిరింది గురూ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే.. ఈ మోటోరోలా ఫోన్ జస్ట్ రూ. 10వేలు మాత్రమే..!

Flipkart GOAT Sale

Updated On : July 13, 2025 / 6:40 PM IST

Flipkart GOAT Sale : మోటోరోలా అభిమానులకు అదిరే ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త GOAT సేల్ సందర్భంగా మోటోరోలా 5G ఫోన్ (12GB ర్యామ్)పై అద్భుతమైన డిస్కౌంట్ (Flipkart GOAT Sale) అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మోటోరోలా ఫోన్ ధరను భారీగా తగ్గించింది.

ఈ ఫోన్ మోడల్ వీగన్ లెదర్ బ్యాక్, కర్వ్డ్ అమోల్డ్ డిస్‌‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. గత ఏడాదిలో భారత మార్కెట్లో లాంచ్ అయిన ఈ మోటోరోలా ఫోన్ 256GB స్టోరేజీ, పవర్‌ఫుల్ 5000mAh బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది.

మోటోరోలా G85 5G ధర :
ప్రస్తుతం, మోటోరోలా G85 5G ధర రూ.15,999 వద్ద అందుబాటులో ఉంది. అసలు ధర రూ.20,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.5వేల ధర తగ్గింపు పొందింది. 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 2 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. 8GB ర్యామ్, 128GB లేదా 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్, అర్బన్ గ్రే, వివా మెజెంటా అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.6వేలు వాల్యూ ఉంటే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10వేల ధరకు పొందవచ్చు. కచ్చితమైన వాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్ బట్టి ఉంటుందని గమనించాలి.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. నచ్చిన ఫోన్ ఆర్డర్ పెట్టేసుకోండి..!

మోటోరోలా G85 5G స్పెసిఫికేషన్లు :
మోటోరోలా G85 ఫోన్ 6.67-అంగుళాల 3D కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz హై రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో 12GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14పై హలో యూఐపై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ప్రీమియం వీగన్ లెదర్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. మోటోరోలా ఫోన్ స్వైప్-టు-షేర్‌తో సహా మరిన్ని ఏఐ ఫీచర్లతో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 33W USB టైప్-C ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP52 రేటింగ్‌ను కలిగి ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 2MP మాక్రో లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్ 32MP కెమెరాను కలిగి ఉంది.