Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఆఫర్లు.. రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. నచ్చిన ఫోన్ ఆర్డర్ పెట్టేసుకోండి..!
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఆఫర్ చేస్తోంది.

Amazon Prime Day Sale 2025 Offers
Amazon Prime Day Sale 2025 : తక్కువ ధరలో కొత్త ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ సందర్భంగా తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు (Amazon Prime Day Sale) అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ రూ. 20వేల వరకు అయితే అద్భుతమైన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు పవర్‌ఫుల్ చిప్‌సెట్‌లు, అద్భుతమైన కెమెరాలు, ఆకర్షణీయమైన డిస్‌ప్లే కలిగి ఉన్నాయి. ప్రీమియం ఫోన్లు కాకుండా ఎంట్రీ-లెవల్ పర్ఫార్మెన్స్ ఫోన్లు కోరుకునే వినియోగదారులకు బెస్ట్ ఫోన్లుగా చెప్పవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో రూ. 20వేల లోపు ధరలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం అందిస్తున్నాం.. ఇందులో ఏది కొంటారో మీరే డిసైడ్ చేసుకోండి.
ఐక్యూ Z10x :
ఐక్యూ Z10x ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్, 120Hz ఫుల్ HD+ LCD డిస్‌ప్లే, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉన్నాయి. డ్యూయల్-కెమెరా సెటప్, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ OSతో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా ఐక్యూ Z10x ఫోన్ రూ.13,498 ధరకు లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ M36 :
శాంసంగ్ గెలాక్సీ M36 ఫోన్ (Amazon Prime Day Sale) శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, పవర్‌ఫుల్ అమోల్డ్ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. 6000mAh బ్యాటరీ, వన్ యూఐ, నాక్స్ సెక్యూరిటీ కలిగి ఉంది. ఎక్కువ కాలం మన్నిక కోరే యూజర్లకు బెస్ట్ ఆప్షన్. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా ఈ శాంసంగ్ గెలాక్సీ M36 ధర రూ. 17,499కు లభిస్తోంది.
రియల్‌మి నార్జో 80 ప్రో :
రియల్‌మి నార్జో 80 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, 50MP సోనీ IMX890 సెన్సార్, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. రియల్‌మి UI 5.0, ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా రియల్‌మి నార్జో 80 ప్రో రూ. 18,998 ధరకు అందుబాటులో ఉంది.