Rajmargyatra App : ‘రాజమార్గయాత్ర’ యాప్ ఇదిగో.. హైవేపై ఇక నో డ్రైవింగ్ టెన్షన్.. ఏ రూట్‌లో టోల్ ఫీజు తక్కువ ఉందో ఇట్టే చెప్పేస్తుంది!
Rajmargyatra App : హైవేపై ప్రయాణించేవారికి ఇక పెద్ద టెన్షన్ తీరినట్టే.. NHAI యాప్‌లో ఏ రూట్‌లో అత్యల్ప టోల్ ఫీజు ఉందో ముందే తెలుసుకోవచ్చు..

Rajmargyatra app (Image Credit : NHAI)
Rajmargyatra App : హైవేపై ప్రయాణించే వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రైవింగ్ టెన్షన్ అక్కర్లేదు. హైవేపై వెళ్లే వాహనదారుల టోల్ ఫీజు టెన్షన్‌కు (Rajmargyatra App) నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ముగింపు పలకనుంది.
రాజమార్గయాత్ర యాప్ ద్వారా ఏ రూట్‌లో అత్యల్ప టోల్ పన్ను ఉంటుందో ఇకపై వాహనదారులు ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వ యాప్ సాయంతో టోల్ టాక్స్ ఇండికేటర్ ఫీచర్ చేర్చనుంది. ఈ యాప్‌లో వినియోగదారులు ఒక సిటీ నుంచి మరో సిటీకి మధ్య అత్యల్ప టోల్ టాక్స్ ఉన్న రూట్ గురించి సమాచారాన్ని పొందవచ్చు.
గూగుల్ మ్యాప్స్ తో ఫీచర్ ఇంటిగ్రేషన్ :
రాజ్‌మార్గయాత్ర మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ కోసం గూగుల్ మ్యాప్స్‌తో కలిసి NHAI పనిచేస్తోంది. ఈ కొత్త ఫీచర్ వాహనదారులకు అతి తక్కువ టోల్ ఛార్జీలకు సంబంధించి వివిధ మార్గాలను సూచిస్తుంది. ఈ సర్వీసు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చిన వెంటనే హైవేపై వాహనదారులు ప్రయాణ సమయం లేదా టోల్ ఫీజులను ఆదా చేసుకోవచ్చు. తక్కువ టోల్ ఫీజు చెల్లించి తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.
“ఢిల్లీ నుంచి ఆగ్రా చేరుకోవడానికి రెండు బెస్ట్ రూట్స్ ఉన్నాయి. అందులో యమునా ఎక్స్‌ప్రెస్‌వే లేదా జాతీయ రహదారి 44 (మధుర రోడ్) ద్వారా వెళ్లవచ్చు. ఇంకా ఏయే రూట్‌లో తక్కువ టోల్ ఛార్జీలు ఉంటాయో ఈ యాప్ వాహనదారులకు తెలియజేస్తుంది” అని అధికారులు తెలిపారు.
డ్రైవింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి ప్రజా రవాణా కోసం గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాఫిక్ డేటా, రియల్ టైమ్ GPS నావిగేషన్‌ను అందిస్తుంది. టోల్ ఛార్జీల ధరల అంచనాలతో మార్గాలను కూడా సూచిస్తుంది. అంతేకాదు.. టోల్‌లను పూర్తిగా నివారించడానికి లేదా వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూట్స్ ఎంచుకునే ఆప్షన్లను కూడా అందిస్తుంది.
వచ్చే నెలలో ప్రత్యేక లింక్ అందుబాటులోకి :
వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల (Rajmargyatra App) కోసం వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్‌ను యాక్టివేట్ చేయడంతో పాటు రెన్యువల్ చేసేందుకు ఒక ప్రత్యేక లింక్ కూడా వచ్చే నెలలో యాప్‌లో అందుబాటులో ఉండనుంది. హైవే ప్రయాణం ఇబ్బంది లేకుండా ఉండేలా కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలో రూ. 3వేల విలువైన పాస్ ప్లాన్లను ప్రకటించారు.
యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది లేదా 200 ట్రిప్పుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో ఏది ముందు అయితే అది అమల్లోకి వస్తుంది. “రాజ్‌మార్గయాత్రకు వార్షిక పాస్ యాక్టివేషన్, రెన్యువల్ లింక్ కూడా అందుబాటులో ఉండనుంది. తద్వారా ఎక్కువ మంది వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని డౌన్‌లోడ్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
74వేలకు పైగా యూజర్లు డౌన్‌లోడ్ :
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఫిబ్రవరి వరకు రాజ్‌మార్గయాత్ర యాప్ 12వేలకు పైగా రివ్యూలను అందుకుంది. 4.4-స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో 3.48 లక్షల డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. 74వేల కన్నా ఎక్కువ మంది మొబైల్ ఫోన్ యూజర్లు, ఆపిల్ స్టోర్ ద్వారా ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.
వాస్తవానికి, ఈ రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ దాదాపు రెండు ఏళ్ల క్రితమే వన్-స్టాప్ రిపోజిటరీగా ప్రవేశపెట్టారు. రియల్ టైమ్ వాతావరణ పరిస్థితులు, వేగంగా నోటిఫికేషన్‌లు, సమీపంలోని టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ఆసుపత్రులు, హోటళ్లు, జాతీయ రహదారి వంటి వివరాలను వినియోగదారులకు అందిస్తుంది.
ఈ యాప్‌లో ఇంటర్నల్ కంప్లయింట్ ఎస్కలేషన్ మెకానిజం కూడా ఉంది. వినియోగదారులు హైవే సంబంధిత సమస్యలను సులభంగా రిపోర్టు చేయొచ్చు. అలాగే, జియో-ట్యాగ్ వీడియోలు లేదా ఫోటోలను కూడా షేర్ చేయొచ్చు. అంతేకాదు.. FASTag కోసం వార్షిక పాస్ ఇప్పుడు NHAI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.