New Income Tax Bill : టాక్స్ ఎగ్గొట్టేవాళ్లకు బిగ్ షాక్.. ఐటీ నిఘా నుంచి ఇక తప్పించుకోలేరు.. మీ ఇమెయిల్స్, సోషల్ అకౌంట్లను పసిగట్టేస్తారు!

Income Tax Rule : పన్ను ఎగ్గొట్టేవారికి దబిడి దిబిడే.. పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరంతే.. మీ ప్రతి కదలికను ఇన్ కమ్ ట్యాక్స్ వాచ్ చేస్తూనే ఉంటుంది. మీ ఇమెయిల్స్, సోషల్ అకౌంట్లను కూడా చెక్ చేస్తారు జాగ్రత్త..

New Income Tax Bill : టాక్స్ ఎగ్గొట్టేవాళ్లకు బిగ్ షాక్.. ఐటీ నిఘా నుంచి ఇక తప్పించుకోలేరు.. మీ ఇమెయిల్స్, సోషల్ అకౌంట్లను పసిగట్టేస్తారు!

New Income Tax Bill

Updated On : March 5, 2025 / 5:19 PM IST

Income Tax Rule : పన్ను ఎగ్గొట్టేవారికి దిమ్మతిరిగే షాక్.. పన్నుచెల్లించకుండా ఎక్కడికి తప్పించుకోలేరు. మీరు ఏది చెబితే అది నమ్మే పరిస్థితి లేదు. ఇకనుంచి మీకు వచ్చే ప్రతి ఆదాయానికి సంబంధించి అన్ని వివరాలను ఆదాయ పన్ను శాఖ గమనిస్తూనే ఉంటుంది. ఏ కొంచెం తేడా వచ్చినా తప్పించుకోలేరు.

ముక్కు పిండి మరి పన్ను వసూలు చేస్తారు. ఇప్పటివరకూ ఏదోలా ట్యాక్స్ కట్టేసి చేతులు దులేపిసుకున్నారు. ఇకపై అలా కుదరదు. మీరు సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అనే పూర్తి వివరాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు నిఘా పెడుతూనే ఉంటారు.

Read Also : Vivo T4x 5G : రూ. 15వేల లోపు ధరలో వివో T4x 5జీ ఫోన్.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. ఈ నెల 12 నుంచే ఫస్ట్ సేల్.. డోంట్ మిస్!

2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది. ఆదాయపు పన్ను అధికారులకు కొత్త అధికారాలు రానున్నాయి. అప్పటినుంచి మీ సోషల్ మీడియా అకౌంట్లతో పాటు ఇమెయిల్‌ అకౌంట్లను కూడా యాక్సెస్ చేయనున్నారు.

ఆదాయ పన్ను శాఖకు  కొత్త అధికారాలు : 
కొత్త ఆదాయపు పన్ను బిల్లు ప్రకారం.. ఆదాయపు పన్ను అధికారికి యాక్సెస్ కోడ్ లేని ఏదైనా కంప్యూటర్ సిస్టమ్ లేదా వర్చువల్ డిజిటల్ అకౌంట్లకు సులభంగా యాక్సెస్ పొందే అధికారం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా అకౌంట్లు, వారి ఈమెయిల్ ఐడీలు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్ అకౌంట్ వంటి వివరాలను కూడా చెక్ చేయనున్నారు.

ఒకవేళ టాక్స్ పేయర్లు ఎవరైనా పన్ను ఎగవేతకు పాల్పడటం చేసినా లేదా ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నా, క్యాష్, గోల్డ్ పరిమితికి మించి ఉన్నట్టు అనుమానం కలిగినా మీ అకౌంట్లు అన్నింటిని జల్లెడ పడతారు జాగ్రత్త.. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను బిల్లులో ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ నిబంధనలను కూడా చేర్చింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారమే ఐటీ అధికారులకు ప్రత్యేక అధికారాలను అందించనున్నాయి. అంతేకాదు.. మీ భవనం, స్థలానికి సంబంధించి లేదా ఏదైనా కంప్యూటర్ సిస్టమ్‌కు యాక్సెస్ కోడ్‌ను ఓవర్‌రైడ్ చేసి యాక్సస్ చేయొచ్చు. పన్ను అధికారులకు ఏదైనా తలుపు, బాక్సు, లాకర్, సేఫ్, బీరువా తాళాలను పగలగొట్టే అధికారం ఉంటుంది అనమాట.

వర్చువల్ డిజిటల్ స్పేస్‌ అంటే ఏంటి? :
ఆదాయ పన్ను బిల్లు ప్రకారం.. ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ అనేది కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఒక టూల్.. మీ ప్రాంతం లేదా స్థలం కంప్యూటర్ సిస్టమ్‌లు, కంప్యూటర్ నెట్‌వర్క్‌లు, కంప్యూటర్ రీసోర్సెస్, కమ్యూనికేషన్ డివైజ్‌లు, సైబర్‌స్పేస్, ఇంటర్నెట్, వరల్డ్ వెబ్ ద్వారా కమ్యూనికేట్ చేసేందుకు ఉపయోగిస్తారు అనమాట.

ఇమెయిల్ సర్వర్లు, సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంకింగ్ అకౌంట్లు, ఆస్తి యాజమాన్య వివరాలను భద్రపరిచే వెబ్‌సైట్, రిమోట్ సర్వర్ లేదా క్లౌడ్ సర్వర్లు, డిజిటల్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌లు వంటివి ఐటీ అధికారులు మీ జోక్యం లేకుండానే యాక్సస్ చేసే అధికారం కలిగి ఉంటారు.

Read Also : DA Hike 2025 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక.. డీఏ పెంపుపై భారీ ప్రకటన..? జీతం, పెన్షన్ ఎంత పెరుగుతుందో తెలుసా?

ప్రస్తుత చట్టం ఏం చెబుతోంది? :
ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టం కూడా ఇదే చెబుతోంది. ఇప్పటివరకూ ఆదాయపన్ను శాఖ అధికారులకు పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉండేవి. ఒకవేళ ఎవరైనా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానం వస్తే వెంటనే వారికి సంబంధించిన అన్నింటిపై సోదాలు నిర్వహిస్తారు.

నగదు లావాదేవీలు, డాక్యుమెంట్స్, ఆస్తి పత్రాలను దాచిపెట్టినట్లు సమాచారం తెలిస్తే వెంటనే వారి లాకర్లు, డోర్లు పగులకొట్టే అధికారం ఉంటుంది. అకౌంట్ బుక్స్, ఇతర డాక్యుమెంట్లు, డబ్బు, బంగారు, ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులు లేదా వస్తువులు దాచినట్టు అనుమానం వస్తే ఏదైనా భవనం, స్థలం, వాహనం లేదా విమానంలోకి అధికారులు ప్రవేశించి సోదాలు చేసే అధికారం ఉంటుందని చట్టం చెబుతోంది.