మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

  • Published By: chvmurthy ,Published On : September 24, 2019 / 04:02 AM IST
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

Updated On : September 24, 2019 / 4:02 AM IST

దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 22పైసలు, డీజిల్ పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు  నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని చమురు ట్యాంకర్లపై దాడుల తర్వాత అంతర్జాతీయంగా పెట్రో ధరలు పెరుగూతూ వస్తున్నాయి.  

గత 8 రోజులుగా చమురు ధరలు పెరుగుతున్నవిషయం తెలిసిందే. గడిచిన 8 రోజుల్లో లీటరు పెట్రోల్ పై 2.20 రూపాయలు, డీజిల్ పై 1.64 రూపాయలు పెరిగింది. సౌదీలో చమురు బావులపై డ్రోన్ దాడులు తర్వాత.. ముడి చమురు ధరల పెరుగుదల దేశంలో కూడా ప్రభావం చూపుతోందని చమురు సంస్థలు చెబుతున్నాయి.