October New Rules : అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.. LPG, UPI నుంచి రైల్వే టికెట్ బుకింగ్ వరకు.. కీలక మార్పుల ఫుల్ లిస్ట్ మీకోసం..
October New Rules : NPS, రైలు టికెట్ బుకింగ్, చిన్న పొదుపులపై వడ్డీతో పాటు ఎల్‌పీజీ వంటి కొత్త నియమాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి.

October New Rules
October New Rules : అక్టోబర్ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చేశాయి. ప్రతినెలా ఒకటో తేదీన ఏదో ఒక ఆర్థికపరమైన కొత్త మార్పు ఉంటుంది. కొత్త నెలలో కొత్త మార్పులు ఆర్థికంగా ప్రభావితం చేస్తాయి. అందులో యూపీఐ లావాదేవీలు, రైల్వే టికెట్ బుకింగ్‌లు లేదా ఎల్‌పీజీ సిలిండర్లు అయినా, ప్రతిచోటా కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి.
మన బడ్జెట్ మరియు పనిని ప్రత్యక్షంగా (October New Rules) ప్రభావితం చేస్తాయి. అక్టోబర్ ప్రారంభంలో రైల్వేలు టికెట్ బుకింగ్ రూల్స్ కూడా ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. తద్వారా ప్రయాణీకులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంకా, ఎల్‌పీజీ సిలిండర్ ధరలలో మార్పులు సామాన్యులపై ప్రభావం చూపుతాయి.
దేశంలోని బ్యాంకులు, ప్రభుత్వ విభాగాలు, UPI, గేమింగ్, నియంత్రణ సంస్థలలో బుధవారం నుంచి అనేక ముఖ్యమైన నియంత్రణ మార్పులు వస్తాయి. వీటిలో బ్యాంకింగ్ ఛార్జీలు, పెన్షన్ నియమాలు, పోస్టల్ సేవలు, రైల్వే బుకింగ్‌లు, చెక్ క్లియరింగ్ వంటి అనేక మార్పులు ఉన్నాయి. ఇంతకీ ఈ మార్పులేంటి? భవిష్యత్తులో ఏది చౌకగా ఏది ఖరీదైనదిగా మారుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
NPSలో మార్పులు :
అక్టోబర్ 1 నుంచి జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS)లో భారీ మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వేతర రంగ ఎన్‌పీఎస్ చందాదారులు ఇప్పుడు ఒకే పథకంలోని ఈక్విటీలలో 100 శాతం వరకు పెట్టుబడి పెట్టగలరు. అయితే, ఇది రాబడి రిస్క్ పెంచుతుంది. చందాదారులు తమ ఫండ్స్‌లో 100 శాతం మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలా వద్దా అనేది పూర్తిగా పెట్టుబడిదారుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా, పెట్టుబడిదారులకు MSF (మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్) కింద PRAN నంబర్ ఇస్తారు. తద్వారా వివిధ పథకాలను మేనేజ్ చేసుకోవచ్చు.
ఇండెక్స్ ఎంపికలపై కొత్త రూల్స్ :
ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్‌లో ఇంట్రాడే పొజిషన్‌లను పర్యవేక్షించేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ (SEBI) జారీ చేసిన కొత్త ఫ్రేమ్‌వర్క్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. పెద్ద ఎక్స్‌పోజర్‌ల నుంచి ఉత్పన్నమయ్యే నష్టాలను నివారించడమే దీని లక్ష్యం. సెబీ కొత్త నియమం ట్రేడింగ్ సమయంలో వ్యక్తిగత సంస్థలు కలిగిన పెద్ద ట్రేడింగ్ పొజిషన్‌లను పర్యవేక్షిస్తుంది.
ఇండియాకు రావడం ఈజీ :
అక్టోబర్ 1 నుంచి విదేశీయులు భారత్‌కు రావడం చాలా సులభం. ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్ద ఎక్కువ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆన్‌లైన్‌లో డిజిటల్ అరైవల్ కార్డ్‌ను పొందితే చాలు.. భారతీయ పౌరులు, OCI కార్డ్ హోల్డర్లకు ఈ నియమం వర్తించదు.
ఎన్నారై-పీపీఎఫ్ :
ఎన్ఆర్ఐలు ఇకపై కొత్త PPF అకౌంట్లను ఓపెన్ చేయలేరు. ఎక్స్ టెన్షన్ కూడా నిలిపివేశారు. NRI సేవర్లు, పెట్టుబడిదారులపై ప్రభావం పడుతుంది.
October New Rules : ఆధార్ లింక్డ్ ట్రైన్ టికెట్ బుకింగ్ :
అక్టోబర్ 1 నుంచి భారతీయ రైల్వేలు రిజర్వేషన్ విండోలోని మొదటి 15 నిమిషాల పాటు ఆధార్-లింక్డ్ IRCTC అకౌంట్ల ద్వారా మాత్రమే ప్రయాణీకులు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ కొత్త రూల్ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లకు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ రైలు బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో ఆధార్-వెరిఫైడ్ అకౌంటుదారులు తమ ఐఆర్‌సీటీసీ అకౌంటుకు ఆధార్ కార్డ్ లింక్ చేసిన వారు మాత్రమే రైలు టిక్కెట్లను బుక్ చేసుకోగలరు. కానీ, మొదటి 15 నిమిషాలు ఇతర టికెట్ బుకింగ్ ఏజెంట్లు ఎవరూ కూడా బుకింగ్ చేయలేరు.
చిన్న పొదుపులపై వడ్డీ :
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ స్కీమ్ (NSS), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCS) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తుంది. ఈ సమీక్షలో కొత్త వడ్డీ రేట్లను మార్చలేదు. ఈ కొత్త రేట్లు అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 వరకు త్రైమాసికానికి వర్తిస్తాయి. ఈసారి ఈ పథకాలపై వడ్డీ రేట్లు తగ్గించలేదు.
LPG సిలిండర్ ధర :
చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన LPG ధరలను సమీక్షిస్తాయి. సెప్టెంబర్ 1న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా 5వ నెల 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను తగ్గించాయి. అయితే, గృహాలలో ఉపయోగించే 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర మారలేదు. ఢిల్లీలో సగటు వినియోగదారునికి ధర రూ. 853 వద్ద ఉంది.
రెపో రేటు, రుణ వాయిదాలు :
ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును మూడుసార్లు ఒక శాతం తగ్గించింది. అయితే, ఈసారి తగ్గింపు తక్కువే. రేటులో ఏదైనా మార్పు ఉంటే అది మీ రుణ వాయిదాలపై ప్రభావం పడుతుంది. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో తగ్గుదల ఉండవచ్చు.
October New Rules : యూపీఐలో కొత్త మార్పులు :
అక్టోబర్ 1 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (UPI) కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఈ సవరించిన నియమాల ప్రకారం.. యూపీఐ యాప్‌లలో ఎక్కువగా ఉపయోగించే ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) “కలెక్ట్ రిక్వెస్ట్” అక్టోబర్ 1, 2025 నుంచి కనిపించదు. మీరు యూపీఐ యాప్‌లను ఉపయోగించి పేమెంట్ చేయవలసి వస్తే QR కోడ్ స్కాన్ చేయాలి. లేదా కాంటాక్ట్ నంబర్‌ను ఎంచుకోవాలి. ఇది లేకుండా, ఏ థర్డ్ పార్టీ మెథడ్ ద్వారా యూపీఐ పేమెంట్లు చేయలేరు.
ఇండియా పోస్ట్ స్పీడ్ పోస్ట్ సర్వీస్ :
పోస్ట్స్ డిపార్ట్మెంట్ (DoP) స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్లు) ఛార్జీలను సవరించింది. కొన్ని గమ్యస్థానాలకు ఛార్జీలు తగ్గించగా మరికొన్నింటికి పెంచింది. OTP-ఆధారిత డెలివరీ, రియల్-టైమ్ ట్రాకింగ్, ఆన్‌లైన్ బుకింగ్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను కూడా పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ ప్రవేశపెట్టింది. ఈ సవరించిన ఛార్జీలు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఇప్పుడు జీఎస్టీ బిల్లులపై సపరేటుగా ఉంటుంది.
ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠిన చర్యలు :
ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమను మరింత పారదర్శకంగా, సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. గేమింగ్ కంపెనీలపై ఇప్పుడు కఠినంగా పర్యవేక్షిస్తారు. ఆటగాళ్లను మోసపోవడం లేదా మోసం నుంచి రక్షించడం, పరిశ్రమలో నమ్మకం, పారదర్శకతను కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం. అన్ని ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రియల్-మనీ గేమింగ్‌లో పాల్గొనేందుకు కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి.
జీఎస్టీ ఇ-ఇన్‌వాయిసింగ్ :
జీఎస్టీ కింద ఈ-ఇన్‌వాయిస్‌లను జారీ చేయాల్సిన వ్యాపారాలకు కొత్త టర్నోవర్ పరిమితిని నిర్ణయించారు. మరిన్ని వ్యాపారాలు ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.
గోల్డ్ మెటల్ రుణాలు :
ఇప్పుడు బ్యాంకుల్లో తీసుకున్న గోల్డ్ లోన్లపై రీపేమెంట్ వ్యవధిని 180 రోజుల నుంచి 270 రోజుల వరకు పెంచాయి. ఆభరణాల ఉత్పత్తిని అవుట్‌సోర్స్ చేసే దేశీయ తయారీదారులు కాని వారికి కూడా ఇలాంటి రుణాలను విస్తరించనున్నాయి.
బంగారం, వెండిపై రుణాలు :
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు ఆభరణాల వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు ఇవ్వడానికి ఆర్బీఐ నియమాలను మార్చింది. టైర్ 3, టైర్ 4 అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా 1 అక్టోబర్ 2025 నుంచి తమ తయారీ లేదా ప్రాసెసింగ్‌లో బంగారాన్ని ఉపయోగించే వ్యాపారాలకు రుణాలు ఇవ్వవచ్చు.
రోడ్డు సేఫ్టీ ఫైన్స్ :
కొన్ని రాష్ట్రాలు కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలను పెంచాయి. రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు కఠినమైన చర్యలను అమలు చేస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త జరిమానాలు అమల్లోకి వస్తాయి.
బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్స్ :
అక్టోబర్ 1 నుంచి కొత్త RBI నిబంధనలు అమల్లోకి వస్తాయి. వినియోగదారులు తమ బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్స్ వెంటనే అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఛార్జీలు (HDFC, PNB, Yes బ్యాంక్) :
లాకర్లు, డెబిట్ కార్డులు, ఏటీఎం విత్‌డ్రాలు, శాలరీ అకౌంట్లు, సర్వీసు ఫెయిల్డ్ కేసులకు కొత్త, సవరించిన రుసుములు ప్రకటించాయి. బ్యాంకు కస్టమర్లు అధిక ఛార్జీలు, కఠినమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ఆర్‌బీఐ చెక్ క్లియరింగ్ :
భారత రిజర్వ్ బ్యాంక్ బ్యాచ్ ఆధారిత చెక్ ప్రాసెసింగ్ నుంచి క్లియరింగ్‌కు మారుతుంది. ఈ మార్పు రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది అక్టోబర్ 4, 2025న ప్రారంభమవుతుంది. రెండోది వచ్చే జనవరి 3, 2026న ప్రారంభమవుతుంది.