Gold Price: బంగారం ధరల్లో సడెన్‌గా ఈ మార్పేంటి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ 10గ్రాముల గోల్డ్ రేటు..
బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ..

Gold
Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బంగారం రేటు వరుసగా రెండోరోజూ భారీగా పెరగ్గా.. వెండి ధరసైతం వరుసగా రెండోరోజు భారీగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24క్యారట్ల గోల్డ్ పై రూ. 600 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 550 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. బుధవారం రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,910 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇవాళ ఏకంగా ఔన్సు ధర 2,943 డాలర్లకు పెరిగింది. మరోవైపు స్పాట్ వెండి ధర 33.14 డాలర్ల వద్ద కొనసాగుతుంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.87.15 వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధరలు మళ్లీ సెడెన్ గా పెరగానికి కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాల పెంపుతో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే అమెరికా సహా ఇతర దేశాల స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండగా.. ఈ అనిశ్చితి సమయంలో మరోసారి బంగారానికి డిమాండ్ పెరిగింది. సురక్షిత పెట్టుబడి సాధనంగా గోల్డ్ ను ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడులకు పెద్దెత్తున మొగ్గుచూపుతున్న క్రమంలో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర భారీగా పెరిగింది.
♦ 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.600 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.550 పెరిగింది.
♦ ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.81,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.88,580కు చేరింది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.88,730.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 81,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.88,580 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధర ఇవాళ పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,10,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,01,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,10,000గా నమోదైంది.