Gold: షాకింగ్‌.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,13,000గా ఉంది.

Gold: షాకింగ్‌.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

GOLD price

Updated On : March 18, 2025 / 10:31 AM IST

పసిడి కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.82,500గా ఉంది.

అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో పసిడి ధర రూ.440 పెరిగి రూ.90,000గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

Gold

Gold

ఇక ఢిల్లీలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 పెరిగి ఇవాళ ఉదయం నాటికి రూ.82,650గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.90,150గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,500గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,000గా ఉంది.

Also Read: సునీతా విలియమ్స్‌ స్ఫూర్తితో శాస్త్రవేత్త అవుతారా? ఇస్రోలో ఉద్యోగాలు ఇలా తెచ్చుకోవచ్చు?

ఇవాళ దేశంలో వెండి ధరల్లో కిలోకి రూ.1,100 పెరుగుదల కనపడింది

ఏ నగరాల్లో ఎలా?

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,13,000గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.1,13,000గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,13,000గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.1,04,000గా ఉంది

పసిడి ధరలు ప్రతిరోజు గంటల వ్యవధిలో మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులతో పాటు దేశీయంగా ఉన్న డిమాండ్ వంటివి ఇందుకు కారణాలు. పసిడి కొనుగోలుదారులు తాము కొంటున్న సమయంలో మార్కెట్లో ఉన్న ధరలను పరిశీలించాలి.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అంతర్జాతీయంగానూ సెంట్రల్‌ బ్యాంకులు కూడా పసిడిని అధిక మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి నుంచి బంగారం ధరలు బయటపడేస్తాయన్న కారణంతో సెంట్రల్‌ బ్యాంకులు బంగారాన్ని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. పలు దేశాల్లాగే భారత్‌ కూడా పెద్ద మొత్తంలో పసిడిని దిగుమతి చేసుకుంది.