Gold Rates Today : బంగారం తగ్గేదే లే… ఏపీ, తెలంగాణలో గోల్డ్ రేట్స్ ఇవే..
Gold Prices Today : బంగారం ధరలు తగ్గడం లేదు. పసిడి పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖపట్నంలో తులం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today
Gold Rates Today : బంగారం తగ్గనంటోంది. పసిడి ధరలు పైపైకి ఎగసిపడుతున్నాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు మరింత పెరిగేలా కనిపిస్తోంది. చూస్తుంటే లక్షదాటేవరకు ఆగేలా లేవు. ఫిబ్రవరి 20, 2025 (ఈరోజు) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.88,190కి దాటింది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,850 పైన ట్రేడవుతోంది. అంటే.. రూ. 390 నుంచి రూ. 400 మధ్య ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. దేశంలో ఒక కిలో వెండి ధర రూ.1,00,500 వద్ద ట్రేడవుతోంది. దేశీయ ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలను ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
Read Also : జీతం చాలట్లేదు.. అప్పులు క్లియర్ చేసేద్దాం అని గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ మిస్టేక్స్ చేయొద్దు..
బంగారం ధరల పెరుగుదలకు కారణాలివే :
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో పసిడిని కొనడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. పేద, మధ్యతరగతికి చెందిన కొనుగోలుదారులు గోల్డ్ కొనాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే బంగారం ధరల పెరుగుదలకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు చర్యలతో బంగారం ధరలు అమాంతం పెరిగాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి. పెట్టుబడిదారులంతా తమ పెట్టుబడులను బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు పెరిగాయి. చూస్తుంటే.. త్వరలోనే పసిడి ధరలు రూ. 90 వేల మార్క్ దాటి ఆపై లక్షకు చేరేలా కనిపిస్తోంది.
ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? :
న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,190 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,850 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. 1,00,500 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, చెన్నై నగరాల్లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,040 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,700 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా :
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,040 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,700 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో కిలో వెండి ధరలు కూడా రూ.1,08,000 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.