Gold
Gold and Silver Rate: దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొండెక్కుతున్న ధరలతో స్వర్ణం సరికొత్త రికార్డులకు చేరుతుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతోపాటు.. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1,040 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 950 పెరిగింది. దీంతో దేశంలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 86,240 రికార్డు స్థాయి ధరకు చేరుకోగా.. 22 క్యారట్ల బంగారం 79,050గా నమోదైంది.
బంగారం ధర ఇవాళ ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. ధరల పెరుగుదల ఇలానే కంటిన్యూ అయితే.. మరో నెల రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. లక్షకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కూడా తోడుకావడంతో బంగారం విక్రయాలు పెరుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,240.
♦ వెండి ధర నాలుగు రోజుల తరువాత పెరిగింది. ఇవాళ కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,07,000 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.79,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,390.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో బంగారం ధర ఒకేలా ఉంది.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,050 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,240.
వెండి ధర ఇలా..
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.99,500.
♦ చెన్నైలో కిలో వెండి ధ రూ. 1,07,000గా నమోదైంది.