Gold Rate: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తెలంగాణ, ఏపీలో తులం గోల్డ్ రేటు ఎంత పెరిగిందో తెలుసా..
ఆగస్టు 2వ తేదీ నుంచి గోల్డ్ రేటు భారీగా పెరుగుతూనే వస్తోంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. దీంతో గడిచిన ఆరు రోజుల్లో తులం బంగారంపై..

Gold
Gold Rate: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఇప్పటికే భారత దిగుమతులపై 25శాతం సుంకాలను విధించిన ట్రంప్.. దానిని 50శాతానికి పెంచారు. అదనంగా జరిమానా, సుంకంగా దీనిని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో దేశీయ మార్కెట్లు గురువారం నష్టా్లో ప్రారంభమయ్యాయి. ఇదే క్రమంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇప్పటికే గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. దీనికితోడు ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ తోడు కావటంతో మరోసారి బంగారం ధర భారీగా పెరిగింది.
ఆగస్టు 2వ తేదీ నుంచి గోల్డ్ రేటు భారీగా పెరుగుతూనే వస్తోంది. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.220 పెరగ్గా.. 22 క్యారట్ల బంగారంపై రూ.200 పెరిగింది. అయితే, ఆగస్టు 2 నుంచి ఇవాళ్టి వరకు తులం గోల్డ్ పై సుమారు రూ.2600 పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై ఏడు డాలర్లు పెరిగింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,378 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి ధరసైతం మూడు రోజులుగా భారీగా పెరుగుతోంది. కిలో వెండిపై మంగళవారం రూ.2వేలు పెరగ్గా.. బుధవారం రూ. వెయ్యి పెరిగింది. ఇవాళ (గురువారం) కూడా రూ.వెయ్యి పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ.4వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.94,000 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,550కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,150కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,700కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.94,000 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,02,550కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,27,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,17,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,27,00 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.