Gold Rates Today : పసిడి పరుగు ఆగినట్టేనా..? నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Gold Rates Today : ఈరోజు (ఫిబ్రవరి 8) శనివారం మాత్రం బంగారం ధరలు కాస్తా స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. 24 క్యారెట్లకు 10 గ్రాముల గోల్డ్ ధర స్థిరంగా రూ. 86,510 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold And Silver Price On 8th February 2025
Gold Rates Today : గతకొద్దిరోజులుగా పసిడి పరుగులు పెడుతోంది. రోజురోజుకీ బంగారం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. అసలే పెళ్లిళ్ల సీజన్.. అందరూ బంగారం కొనేందుకు చూస్తుంటారు. ఇలాంటి సమయంలో బంగారం సామాన్యులకు కొనడం కష్టంగా కనిపిస్తోంది.
అయితే, ఈరోజు (ఫిబ్రవరి 8) శనివారం మాత్రం బంగారం ధరలు కాస్తా స్థిరంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. 24 క్యారెట్లకు 10 గ్రాముల గోల్డ్ ధర స్థిరంగా రూ. 86,510 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ. 79,300 వద్ద ట్రేడ్ అవుతోంది.
Read Also : మీకు జీతం తక్కువగా వస్తుందా? ఇలా పెట్టుబడి పెట్టండి చాలు.. లైఫ్ మొత్తం హ్యాపీగా బతికేయొచ్చు..!
వెండి ధర కూడా తగ్గేదేలా అన్నట్టుగా కనిపిస్తోంది. ఈరోజు వెండి ధర సైతం స్థిరంగానే కనిపిస్తోంది. కిలో వెండి ధర రూ. 1.07 లక్షల వద్ద స్థిరంగా ఉంది. గతకొద్ది వారాల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అయితే చెప్పనక్కర్లేదు.. దాదాపు రూ. 5వేల వరకు దూసుకెళ్లింది. ముఖ్యంగా బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.
అందులోనూ ట్రంప్ కఠిన చర్యలు కూడా బంగారం పెరుగుదలకు ప్రేరేపించాయి. అగ్రరాజ్యంలో బంగారం ఒక ఔన్సు 2900 డాలర్లు తాకింది. త్వరలోనే 3వేల డాలర్లకు చేరుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదేగానీ జరిగితే భారత బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కూడా లక్ష దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బంగారం ధరల పెరుగుదలకు అమెరికా ఆర్థిక వ్యవస్థపై భయాలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ. 79,300 వద్ద ఉంది. అంతకుముందు వరుసగా రూ. 250, రూ. 950, రూ. 1050 ఇలా పెరుగుతూ పోయింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 86,510 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 79,450 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే, 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 86,660 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం మాదిరిగానే వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. మొన్నటివరకూ బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు పెరగలేదు. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధరలు స్థిరంగా రూ. 99,500 వద్ద ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్‌లో వెండి ధరలు ఢిల్లీలో కన్నా చాలా ఎక్కువగానే ఉన్నాయి.
Read Also : Saturn Transit 2025 : శని ‘సడేసతి’ వస్తోంది.. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఏ పరిహారం చేయాలంటే?
హైదరాబాద్‌లో కిలో ధర రూ. 1.07 లక్ష దాటేసింది. అలాగే, ప్రస్తుతం ముంబైలో బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 79,450 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే, 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 86,670 వద్ద ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? :
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు రూ. 86,670గా ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.79,450 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక నేటి వెండి రేట్ల విషయానికి వస్తే స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 99,500కి చేరుకోగా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి రేటు రూ. 1,07,000 పలుకుతోంది.