Gold Rate Today : శుభవార్త .. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు,తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు గోల్డ్ ధర ఎంతంటే?

దీపావళి పండుగ సంబరాల వేళ మహిళలకు బంగారం, వెండి ధరలు రోజు రోజుకు తగ్గుతు శుభవార్తనిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

Gold Rate Today : శుభవార్త .. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు,తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు గోల్డ్ ధర ఎంతంటే?

Gold rate

Today Gold and Silver Rate : దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. మరీ ముఖ్యంగా బంగారం ధర తగ్గితే కొనేందుకు మహిళలు ఇది శుభవార్త అనే చెప్పాలి. బంగారం ధర కాస్త తగ్గినా కొనేందుకు ముందుకొస్తుంటారు మహిళలు. దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటం మహిళా మణులకు ఆనందదాయకంగా మారుతోంది. రోజు రోజుకు కాస్త ఊరట నివ్వటంతో కొనేందుకు మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంట్లో భాగంగా వరుసగా నాలుగో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గటం నిజంగా శుభవార్త అనే చెప్పాలి.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.410లు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.450 తగ్గింది. దీంతో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. శుక్రవారం ఉదయం అందిన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 300 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నాలుగో రోజు కూడా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,690 కాగా, 24 క్యారెట్ల 10గ్రాములు గోల్డ్ రూ. 60,750 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 60,900.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,690 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,750కు చేరింది.
– చెన్నైలో తులం బంగారంపై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,140 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.61,240కు చేరింది.

తగ్గిన వెండి ధర..
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం .. వెండి ధర తగ్గింది. శుక్రవారం వారం కిలో వెండిపై రూ. 300 తగ్గగా.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,200కు చేరింది.