Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Rate Today : పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?

Gold Rate Today

Today Gold and Silver Rate : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి బిగ్ షాక్… బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దీపావళి పండుగ సందర్భంగా పడిపోయిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బుధవారం తులం బంగారంపై రూ. 100 పెరగ్గా.. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 400 పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 పెరిగింది. మరోవైపు వెండి ధరసైతం భారీగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై రూ. 1700 పెరిగింది. రెండు రోజుల్లోనే వెండి ధర కిలోపై రూ. 2300 పెరిగింది.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,950 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 61,040 కు చేరింది.

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,100 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 61,190.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 55,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,040 కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 300, అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 490 పెరిగింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.56,450 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.61,580కు చేరింది.

Gold

Gold

పెరిగిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 1700 పెరిగింది. దీంతో గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,7000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,700. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.74,700 కు చేరింది. బెంగళూరులో వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. 250 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.71,500 వద్ద కొనసాగుతోంది.