Gold Price Today: పండగ వేళ మహిళలకు షాకింగ్ న్యూస్ .. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?
భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారాయి. నెల రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో 22 క్యారెట్ల తులం బంగారంపై ..

GOLD RATE
Gold and Silver Rate Today 22nd October 2023: భారత్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ఖరీదైనవిగా మారాయి. నెల రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. పది రోజుల వ్యవధిలో 22 క్యారెట్ల తులం బంగారంపై సుమారు 3వేల వరకు పెరుగుదల చోటు చేసుకుంది. ఆదివారంసైతం మరోసారి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 పెరుగుదల చోటు చేసుకుంది. వెండిధర సైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 1200 పెరుగుదల చోటు చేసుకుంది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పెరిగింది. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ. 56,600 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ. 61,750 వద్ద కొనసాగుతుంది.

gold
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ. 61,900కు చేరింది.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750 కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 56,700 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,850 కు చేరింది.

Gold
పెరిగిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో ఆదివారం పెరుగుదల చోటు చేసుకుంది. కిలో వెండిపై రూ. 1200 పెరిగింది. దీంతో ఆదివారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,700 కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,700. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో రూ.75,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.74,500 కు చేరింది.