Gold Price Today : మరోసారి భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో వారంరోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో
![Gold Price Today : మరోసారి భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో వారంరోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే? Gold Price Today : మరోసారి భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో వారంరోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయంటే?](https://10tv.in/wp-content/uploads/2024/07/Gold-Price-444.jpg)
Gold Price
Gold and Silver Price Today : మీరు బంగారం కొనుగోలు చేస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 270 తగ్గింది. దీంతో గడిచిన ఆరు రోజుల్లో బంగారం ధర సుమారు రూ. 1500 తగ్గింది. మరోవైపు వెండిధర సైతం భారీగా తగ్గుముఖం పడుతుంది. ఇవాళ కిలో బంగారంపై రూ. 400 తగ్గగా.. గడిచిన వారం రోజుల్లో కిలో బంగారంపై సుమారు రూ. 5వేలు తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,580. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,600 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,730.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,450 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,580.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,100 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,290కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 95,600.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.96,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 91,100 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.91,100.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 91,000 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.