Gold Price today : తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ్టి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold And Silver Price Today

Gold And Silver Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధర తగ్గింది. గత మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండి ధర స్వల్పంగా తగ్గింది. దేశవ్యాప్తంగానేకాక.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,750 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,770.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,850 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,920.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.72,770.
చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.66,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,770 వద్ద కొనసాగుతుంది.

వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా మంగళవారం వెండి ధర స్వల్పంగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,900 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.91,000.
కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి రూ. 86,000 వద్ద కొనసాగుతుంది.
బెంగళూరులో వెండి ధర భారీగా తగ్గింది. అక్కడ కిలో వెండిపై రూ. 2వేలు తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 83,000 వద్ద కొనసాగుతుంది.

పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు