Gold Rate : రూ.70వేల మార్క్ దాటి పరుగులు తీస్తున్న పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : రూ.70వేల మార్క్ దాటి పరుగులు తీస్తున్న పసిడి ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా..

Gold

Gold Rate in Hyderabad : బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. దీంతో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు బలపడ్డాయి. దీనికితోడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బంగారంకు గిరాకీ పెరిగింది. ఇదిలాఉంటే.. బుధవారం గోల్డ్ ధర భారీగా పెరగ్గా.. గురువారంసైతం భారీగా పెరిగింది. తాజాగా నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 500 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 600 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 10గ్రాముల బంగారం ధర రూ. 70వేల మార్క్ దాటి దూసుకెళ్తోంది. మరోవైపు వెండిధర సైతం పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరగడంతో.. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కిలో వెండి రూ. 85వేలకు చేరింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,600 మార్క్ కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 70,470 జీవనకాల గరిష్టలను తాకింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 70,620.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 64,600 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,470.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.65,450 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.70,400కు చేరింది.

Gold

  • భారీగా పెరిగిన వెండి ధర ..
    దేశం వ్యాప్తంగా వెండి ధర భారీగా పెరిగింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.85,300 మార్క్ కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నై, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ. 85,300. ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.82,000 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,750 వద్ద కొనసాగుతుంది.

Gold Price Today

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు