Gold Silver Price Today : వామ్మో.. దడ పుట్టిస్తున్న గోల్డ్ రేట్లు.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. కారణాలివే.. ఈరోజు ధరలు ఇలా..
Gold Silver Price Today : బంగారం ధర షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. గురువారం గోల్డ్ రేటు భారీగా పెరగ్గా.. ఇవాళ కూడా భారీగా పెరిగింది.

బంగారం ధరలు దడపుట్టిస్తున్నాయి. ఊహించని స్థాయిలో పెరుగుదల నమోదు చేస్తున్నాయి. గురువారం తులం బంగారంపై ఏకంగా రూ.4300 పెరగ్గా.. ఇవాళ (శుక్రవారం) కూడా గోల్డ్ రేటు భారీ పెరిగింది.

అంతర్జాతీయంగా చమురు మంటలు కొనసాగుతున్న వేళ అమెరికా డాలర్ విలువ పడిపోవడం.. యూఎస్ బాండ్లపై రాబడి తగ్గుతుండటంతో మదుపరులు లోహాల వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా డిమాండ్ పెరిగి, బంగారం ధరలు భారీగా పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల చివరి నాటికి గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1210 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1100 పెరుగుదల చోటు చేసుకుంది. దీంతో రెండు రోజుల్లోనే తులం బంగారంపై రూ.6వేలకుపైగా పెరుగుదల చోటు చేసుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 22 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 4,537డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా పెరుగుతోంది. గురువారం కిలో వెండిపై రూ.10వేలు పెరగ్గా.. ఇవాళ కిలో వెండిపై స్వల్పంగా పెరుగుదల చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,60,480 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,47,100 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,60,630 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,47,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,59,280కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,46,010 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,100 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,100కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
