Gold Price : పసడి ప్రియులకు ఊరట… ఈ రోజు బంగారం, వెండి ధరలు

కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి.

Gold Price Today : కాలంతో పని లేదు. పండుగలతో నిమిత్తం లేదు. సీజన్ ఏదైనా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజ‌న్‌లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పసిడి ధరలు చుక్కలను తాకుతాయి. పసిడి ధరల్లో రోజురోజుకు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతాయి.

New PF Rule : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయకపోతే నష్టపోతారు

తాజాగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బంగారం ధ‌ర స్థిరంగా ఉంది. ఢిల్లీ మార్కెట్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.6 త‌గ్గి రూ.46,123కు చేరింది. క్రితం ట్రేడ్‌లో తులం స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.46,129 దగ్గర ముగిసింది. కాగా, వెండి ధ‌ర ఇవాళ స్వ‌ల్పంగా త‌గ్గింది. ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి రూ.515 త‌గ్గి రూ.61,821కి చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.62,336 దగ్గర ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,811 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 23.82 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.

Life Expectancy : వాయుకాలుష్యంతో భారతీయుల ఆయుర్దాయం 9 ఏళ్లు తగ్గిపోవచ్చు!

ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. పుత్తడిని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక భారతీయులకు అత్యంత ప్రియమైనది పసిడి. మహిళలు గోల్డ్ కి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ధర ఎంత పెరిగినా భారతీయులు బంగారం కొనుగోళ్లు మాత్రం ఆపరు.

బంగారం ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల దగ్గరున్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు