Gold Price Today June 8 : పసిడి ప్రియులకు పండగే.. భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. కొనేవారికి గోల్డెన్ ఛాన్స్!
Gold Price Today June 8 : బంగారం కొనేవారికి అద్భుతమైన సమయం.. బంగారం కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోంది. వరుసగా పసిడి పతనం దిశగా వెళ్తోంది.

Gold Price Today : ప్రస్తుతం బంగారం, వెండి ధరలు కొనుగోలుకు మంచి సమయంగా చెప్పవచ్చు. కొనుగోలుదారులు ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనేందుకు చూస్తుంటే ఇంతకన్నా మంచి సమయం ఉండదు.

ప్రస్తుతం జూన్ 8 సాయంత్రం వేళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,51,690 వద్ద ట్రేడ్ అవుతోంది.

22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,39,050 వద్ద పలుకుతోంది. అలాగే, కిలో వెండి ధర కూడా రూ.2,70,000 వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు గోల్డ్ ధర దాదాపు రూ.2వేలకు పైగా తగ్గింది.

వెండి ధర కిలోకు రూ.5వేలకు పైగా తగ్గింది. విజయవాడ, విశాఖలో కూడా ఇదే బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటంతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై వస్తున్న అంచనాలకు అనుగుణంగా పసిడి ధరలపై ఒత్తిడిని పెంచాయి.

ఒకవేళ డాలర్ వాల్యూ పెరిగితే పెట్టుబడిదారులు బంగారం కన్నా బాండ్లు, ఇతర పెట్టుబడులపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

బంగారం ధరల ప్రభావం వెండి ధరలపై కూడా పడినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే.. రానున్న రోజుల్లో ధరల్లో వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం తగ్గుదల అనేది గోల్డ్, సిల్వర్ కొనాలని చూసేవారికి నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఆషాఢ మాసానికి ముందు బంగారం ధరలు తగ్గడంతో జ్యువెలరీ షాపుల్లో కూడా కొనుగోలుదారుల రద్దీ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
