Gold Prices in India: దేశంలో బంగారం ధరలు ఎంతగా పెరిగిపోతాయో తెలుసా? ఇప్పుడుగనక గోల్డ్ కొంటే సామిరంగా..
దేశంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించేందుకు బాగా ఇష్టపడతారు.

Gold
దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.86,620గా ఉంది. ఈ ఏడాది పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలు కనపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలో మహిళలు బంగారు ఆభరణాలను ధరించేందుకు బాగా ఇష్టపడతారు. శుభకార్యాలలోనూ పసిడిని బాగా వాడతారు. అయితే, త్వరలోనే బంగారం ధరలు 10 గ్రాములకు రూ.90,000 దాటవచ్చు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి: ప్రస్తుతం ప్రపంచంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా మారుస్తున్నాయి. దీంతో దాని డిమాండ్, ధరలు పెరుగుతాయి.
Also Read: ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల్లో L1, L2, L3 ఏంటని తికమకపడుతున్నారా? పూర్తి వివరాలు ఇవిగో..
సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు: సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తమ నిల్వల కోసం బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది డిమాండ్‌కు దోహదం చేస్తుంది. దీంతో గోల్డ్ రేట్ పెరుగుతుంది.
ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు: ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ హెచ్చుతగ్గుల గురించి ఉన్న ఆందోళనలు పెట్టుబడిదారులను బంగారంపై పెట్టుబడి పెట్టేలా మార్చుతాయి. దీంతో దాని డిమాండ్, ధర పెరుగుతుంది.
మరోవైపు, బంగారం ధరలు పెరిగేకొద్దీ దేశంలో వినియోగదారుల డిమాండ్ ప్రజల స్తోమత, ఆర్థిక సమస్యల కారణంగా తగ్గే అవకాశాలూ లేకపోలేదు. గత ఏడాదితో పోల్చితే 2025లో దేశంలో బంగారం వినియోగం క్షీణిస్తుందని ప్రపంచ బంగారు మండలి (World Gold Council) అంచనా వేసింది. ఈ ఒక్క అంచనాని పక్కనపెట్టి చూస్తే దేశంలో బంగారానికి ఫుల్ డిమాంట్ ఉంటుంది. బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలే తప్ప నష్టాలు ఉండవు.