దీపావళి నాటికి బంగారం ధర రూ.70వేలకు వెళ్లే అవకాశాలు

దీపావళి నాటికి బంగారం ధర రూ.70వేలకు వెళ్లే అవకాశాలు

Updated On : August 9, 2020 / 6:50 PM IST

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటికి ఆల్రెడీ రూ.57వేలు దాటేసింది బంగారం. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిపోర్టుల ప్రకారం.. 16వ సారి కూడా పెరుగుతూనే ఉంది కానీ ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించడం లేదు. ఈ ఏడాది దీపావళి నాటికి బంగారం ధర మరింత పైకి చేరుకోనున్నట్లు చెప్తున్నారు నిపుణులు.

జేపీ మోర్గాన్ రిపోర్ట్ ప్రకారం.. బంగారం ధర రాబోయే రెండేళ్లలో రూ.70వేలకు చేరుతుందట. COVID-19 సంక్షోభం తీరిపోయినా బంగారం ధర తగ్గడమంటూ ఉండదని నిపుణుల అంచనా. ధర పెరుగుతున్న కొద్దీ డిమాండ్లో కూడా మార్పులు ఉండవని చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా 10 గ్రాములు గోల్డ్ ధర రూ.57వేల 8కి పడిపోయింది.

అదే విధంగా వెండి ధరల్లోనూ అదే స్థాయిలో పెరుగుదల కనిపిస్తుంది. బంగారంతో పాటు వెండి పెరుగుతూనే వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ లెక్కల ప్రకారం.. రెండింటిలోనూ ఎన్నడూ లేనంత అధిక ధరలు పలుకుతున్నట్లు వెల్లడైంది.

ఢిల్లీలో బంగారం ధర గ్రాముకు 6రూపాయలు పెరిగి మరోసారి టాప్ కు చేరింది. ఇండియాలో వరుసగా 16వ రోజు కూడా బంగారం పెరిగిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడులు తపన్ పటేల్ అంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం, వెండి వరుసగా ఔన్సుకు 2వేల 61 అమెరికన్ డాలర్ల వద్ద 28.36 అమెరికన్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.