Gold Rates : ఇప్పుడు తగ్గిన బంగారం.. త్వరలో రూ. లక్ష మార్క్ దాటనుందా? కొనేసుకోవడమే బెటరా? నిపుణుల అంచనాలివే!
Gold Rates : ప్రస్తుతం బంగారం ధర 82వేలు దాటింది. రాబోయే రోజుల్లో ఈ బంగారం ధరలు లక్షమార్క్‌ను దాటే అవకాశం లేకపోలేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

gold rates today
Gold Rates : అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఈరోజు (జనవరి 28) కొద్దిగా తక్కువగా ట్రేడవుతున్నాయి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే మహిళలకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగిన బంగారం ధర కాస్తా రెండు రోజులుగా తగ్గుతూ వస్తోంది. నేడు (జనవరి 28, 2025) మంగళవారం భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 8,193, 22 క్యారెట్ల బంగారం గ్రామ్‌కు రూ. 7,510గా తగ్గింది.
10 గ్రాముల 22 కిలోల బంగారం ధర సోమవారం రూ. 75,400 నుంచి మంగళవారం రూ. 300 తగ్గి రూ. 75,100కి చేరుకుంది. అయితే, 100 గ్రాముల 22 కిలోల బంగారం ధర ఒక్క రోజులోనే రూ. 3వేలు తగ్గి రూ.7,51,000కి చేరుకుంది. నిన్న బంగారం ధర రూ.7,54,000గా నమోదైంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 81,930గా ఉంది. నిన్న రూ.82,250తో పోలిస్తే ఈరోజు ధర రూ. 320 తగ్గింది. రెండు రోజుల్లో 22 క్యారెట్ గోల్డ్ 450 తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 73,095కి చేరుకుంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,010కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,343గా ఉంది. వెండి ధర కూడా భారీగా తగ్గడంతో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1370కి తగ్గింది. దీని ధర ఇప్పుడు 90,210కి చేరుకుంది. విజయవాడ, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.90,510గా ఉంది.
రూ.82వేల మార్క్ దాటిన బంగారం :
త్వరలో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశం జరుగనుంది. కేంద్ర బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా కీలకం కానున్నాయి. భారతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు త్వరలో మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ వంటి అంశాలు ఇందుకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర 82వేలు దాటింది. రాబోయే రోజుల్లో ఈ బంగారం ధరలు లక్షమార్క్‌ను దాటే అవకాశం లేకపోలేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదే జరిగితే సాధారణ మధ్యతరగతి వాళ్లు ఈ బంగారాన్ని కొనడం కష్టమేనని అనిపిస్తోంది. అసలు బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడానికి కారణాలు లేకపోలేదు. దేశీయ బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా? రాబోయే బడ్జెట్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి? ఫిబ్రవరి 1 తర్వాత బంగారం ధర ఏ దిశగా కొనసాగుతుందనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.
డొనాల్డ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత బంగారం ధరలు దిగివస్తాయని భావించగా, అది జరగలేదు. ట్రంప్ వచ్చిరావడమే పాలసీలను మార్చేశాడు. విదేశీ కంపెనీల మీద టారిఫ్ విధిస్తానని ప్రకటించడంతో దాంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో అయోమయం చోటుచేసుకుంది. అమెరికా దుందుడుకు చర్యలతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు ఇప్పుడు డీప్ సీక్ ఏఐ ఆవిష్కరణతో స్టాక్ మార్కెట్లు కూడా బ్లీడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇప్పుడే బంగారం కొనేసుకోవడం బెటరా? :
గత జులైలో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించగా ఆ తర్వాత బంగారం దిగుమతులు 104 శాతం మేర పెరిగాయి. బంగారం ధరల పెంపునకు కస్టమ్స్ డ్యూటీల పెంపు కారణం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం సుంకాలు పెంచినా లేదా పెంచకపోయినా దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి అవకాశం ఉందని అంటున్నారు.
యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, అమెరికా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, డాలర్ విలువ అంశాలు కూడా కారణమవుతాయని అంటున్నారు. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు ఇప్పుడే కొనుక్కుంటే మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు.