Gold Rate Today : ట్రంప్ కీలక నిర్ణయం.. బంగారం కొనేవాళ్లకు గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్ రేటు.. మరో వారం రోజుల్లో..

Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు భారీ గుడ్ న్యూస్. గోల్డ్ రేటు ఒక్కరోజులోనే భారీగా తగ్గింది.

Gold Rate Today : ట్రంప్ కీలక నిర్ణయం.. బంగారం కొనేవాళ్లకు గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన గోల్డ్ రేటు.. మరో వారం రోజుల్లో..

Gold Rate Today

Updated On : October 27, 2025 / 12:12 PM IST

Gold Rate Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు భారీ గుడ్ న్యూస్. గోల్డ్ రేటు ఒక్కరోజులోనే భారీగా తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో గోల్డ్ రేట్లు పతనమవుతున్నాయి. మరో వారం రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రాథమిక ఏకాభిప్రాయం కుదిరిందని చైనా ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ ను కలవడానికి కొన్నిరోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో అంతర్జాతీయంగా చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తత వాతావరణం తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్టర్లు ఇతర వాటిపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా బంగారం ధర తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర భారీగా తగ్గింది. 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ.1140 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై 1050 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 43డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,070 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,14,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,24,480కు చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ. 1,24,630కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,14,250కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,24,480కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,70,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,55,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,70,000 వద్దకు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.