Gold Silver: వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత ఉండనున్నాయో తెలుసా?
డిసెంబరు 18 నుంచి 22 మధ్య (ఈ ట్రేడింగ్ వీక్‌లో) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ గోల్డ్ 10 గ్రాముల ధర...

Gold
Weekly Outlook Yellow Metal: న్యూ ఇయర్‌కి వారం రోజుల ముందు బంగారం, వెండి ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా? డిసెంబరు 18 నుంచి 22 మధ్య (ఈ ట్రేడింగ్ వీక్‌లో) మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.60,500 నుంచి రూ.64,500 మధ్య ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, వెండి ధర కిలోకి రూ.73,000 నుంచి రూ.77,000 మధ్య ఉండనుంది. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గత వారం బంగారం, వెండి ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.62,510గా ఉంది. నిన్న కూడా దీని ధర ఇంతే ఉంది.
అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర గతవారం ఔన్సు రూ.1,69,820గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం ఔన్సుకు రూ.1,70,236గా ఉంది. వెండి ధరలో కూడా ఏమీ మారలేదు. నిన్న, ఇవాళ కిలో వెండి ధర రూ.77,700గా కొనసాగుతోంది.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఫండ్స్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయాల వల్ల బంగారం, వెండి ధరలు ఈ వారంలో కాస్త పెరిగాయి. భారత్‌లో ఇవాళ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.62,180 దాటింది.
Why Gold Price is Up?: 2023లో బంగారం ధర ఇంతగా ఎందుకు పెరిగిందో తెలుసా?