Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. నేడు ఏపీ, తెలంగాణలో ధరలివే..
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. నేడు వీటి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
Gold Silver Price Today
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. రెండు రోజుల క్రితం వరకు భారీగా తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు భారీగా పెరిగాయి.
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.430 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై 40డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,191 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,34,300 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,46,660 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,370కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,000 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
