అసలైన పండగ ఇదే : భలే డిస్కౌంట్లు.. భారీగా తగ్గిన స్మార్ట్ టీవీల ధరలు 

  • Published By: sreehari ,Published On : October 4, 2019 / 07:15 AM IST
అసలైన పండగ ఇదే : భలే డిస్కౌంట్లు.. భారీగా తగ్గిన స్మార్ట్ టీవీల ధరలు 

Updated On : October 4, 2019 / 7:15 AM IST

పండగ సీజన్ మొదలైంది. కొత్త టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు భారీగా ధరలు తగ్గాయి. దసరా, దీపావళి పండగల సీజన్‌లో వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఎలక్ట్రానిక్ కంపెనీలు తమ ప్రొడక్టులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే తక్కువ ధరకే కొత్త స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోండి.

కొన్ని రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్సు సహా ఇతర పన్నులు తగ్గించడంతో ఇప్పటివరకూ సేల్స్ పడిపోయిన కంపెనీల్లో కొత్త ఆశలు చిగురించాయి. అందులోనూ పండగ సీజన్ కావడంతో టీవీల ధరలు అమాంతం తగ్గించాయి. స్మార్ట్ టీవీలపై 30 శాతం వరకు ధరలు దిగొచ్చాయి. ఒక్కో టీవీపై ధర ఎంత ఉంది? ఆఫర్లు.. డిస్కౌంట్లు ఏంటో ఓసారి చూద్దాం. 

టాప్ బ్రాండ్లపై రూ.40 వేలు తగ్గింపు : 
దేశీయ మార్కెట్లలో పాపులర్ టీవీ బ్రాండ్లలో ధరలు భారీగా తగ్గాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌జీ, సోనీ, శాంసంగ్ టాప్ టీవీ బ్రాండ్లు అధిక పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. భారీ స్ర్కీన్, ప్రీమియం మోడల్ కేటగిరీలో సుమారుగా ధరలను రూ.40వేల వరకు తగ్గించాయి.

స్మార్ట్ టీవీల స్ర్కీన్ సైజులు 32, 43, అంగుళాల టీవీలపై కూడా భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ఆయా కంపెనీలు అందిస్తున్నాయి. చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, షియామీ, శాంసంగ్, ఎల్ జీ, వీయూ, కొడక్, థామ్సన్, టీసీఎల్, ఐఫాల్కన్ కంపెనీలు కూడా తమ ప్రొడక్టులపై ధరలను తగ్గించాయి. 

32 అంగుళాల టీవీ.. రూ.7వేలు మాత్రమే : 
మీరు కొనే టీవీ సైజు ఎంత? 32 అంగుళాల టీవీ అయితే రూ.7వేలకు సొంతం చేసుకోవచ్చు. 43 అంగుళాల 4K స్మార్ట్ టీవీ రూ.21 వేలకే లభ్యం అవుతోంది. ప్రీమియం విభాగంలో కూడా స్మార్ట్ టీవీల ధరలు బాగా తగ్గాయి. 55 అంగుళాల సోనీ 4K Ultra HD స్మార్ట్ టీవీ రూ.1.1 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.

ఆగస్టు నెలలో రూ.1.3 లక్షలు ఉండగా.. నెల వ్యవధిలోనే రూ.20 వేలు వరకు తగ్గిపోయింది. ఎల్‌జీ కంపెనీ టీవీల్లో 65 అంగుళాల Ultra HD స్మార్ట్ టీవీ ధరను రూ.1.34 లక్షల నుంచి రూ.1.2 లక్షలకు తగ్గాయి. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ ట్యాక్స్ తగ్గడంతో కంపెనీలన్నీ ఆఫర్లు డిస్కౌంట్లు గుమ్మరిస్తున్నాయి.

LED టీవీల ఓపెన్ సెల్ ప్యానల్ తయారీకి అయ్యే ఖర్చు 60శాతం నుంచి 70 శాతంగా ఉంటుంది. ఎందుకంటే ప్యానల్స్ తయారీకి విదేశాల నుంచి ఎగుమతి చేసుకోవాల్సి పరిస్థితి ఉంది. దిగుమతి సుంకం తగ్గించడంతో టీవీల ఖర్చు 20శాతం నుంచి 25 శాతం వరకు తగ్గింది. 

మూడు TCL స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపు :
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ TCL కూడా ఇండియా మార్కెట్లలో తమ స్మార్ట్ టీవీల ధరలపై భారీగా తగ్గించింది. ఫెస్టివల్ సేల్ లో భాగంగా మొత్తం మూడు స్మార్ట్ టీవీలపై టీసీఎల్ ధరలు తగ్గాయి. తొలి మోడల్ టీవీ.. 40 అంగుళాల Full HD డిస్ ప్లే TCL (0S62FS) స్మార్ట్ టీవీ ధర రూ. 14వేల 999కే ఆఫర్ చేస్తోంది. రెండో మోడల్ (43P65US) టీవీపై TCL టీవీ ధర తగ్గింపు ధరతో రూ.20వేల 990కే లభిస్తోంది.

ఇందులో అమెజాన్ అలెక్సా బుల్ట్ ఇన్ సపోర్ట్ ఉంది. ఇక మూడో మోడల్ TCL 65P8 స్మార్ట్ టీవీ ధర రూ.47వేల 999కే లభిస్తోంది. ఇందులో ఆండ్రాయిడ్ పై టీవీ ఎడిషన్ రన్ అవుతుంది. AI వాయిస్ రికగ్నైజేషన్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్ ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నాయి. ఇతర OTT స్ట్రీమింగ్ యాప్స్ కూడా ఇన్ బుల్డ్ సపోర్ట్ ఉంది.