Google Layoffs : గూగుల్ ఉద్యోగాల్లో కోతలు.. 10 శాతం తొలగింపులపై సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన!
Google Layoffs : సీఈవో సుందర్ పిచాయ్ ప్రకారం.. ఇటీవల ఒక ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో కంపెనీ డైరెక్టర్లు, వీపీలతో సహా మేనేజర్ పోస్టులలో 10శాతం తగ్గించినట్లు వెల్లడించారు.

Sundar Pichai announces major job cuts in Google
Google Layoffs : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ టెక్ దిగ్గజం గూగుల్ మళ్లీ ఉద్యోగాల్లో కోత మొదలుపెట్టింది. ఏఐ రేసులో ఇతర కంపెనీలతో పోటీగా గూగుల్ ఉద్యోగాల్లో కోతపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వైస్ ప్రెసిడెంట్ లెవల్, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
పెరుగుతున్న ఏఐ పోటీ మధ్య గూగుల్ మేనేజ్మెంట్ సిబ్బంది సంఖ్యను తగ్గించింది. సీఈవో సుందర్ పిచాయ్ ప్రకారం.. ఇటీవల ఒక ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో కంపెనీ డైరెక్టర్లు, వీపీలతో సహా మేనేజర్ పోస్టులలో 10శాతం తగ్గించినట్లు వెల్లడించారు. ఓపెన్ఏఐ వంటి పోటీదారుల నుంచి పెరుగుతున్న ఏఐ పోటీ మధ్య సెర్చింగ్ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ వర్క్‌ఫోర్స్‌ను క్రమంగా తగ్గించుకుంటుంది.
కాలిఫోర్నియా (AP)లోని మౌంటెన్ వ్యూలో జరిగిన గూగుల్ (I/O) ఈవెంట్లో అల్ఫాబెట్ సీఈఓ పిచాయ్ మాట్లాడుతూ.. గూగుల్ కట్ మేనేజర్ రోల్స్ తొలగింపుల రౌండ్ జరిగింది. చాలా మంది మేనేజర్లు, వీపీలకు వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. ఇప్పటికే, ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ పోస్టులకు బదిలీ చేయగా, మరికొంతమందిని పూర్తిగా సెర్చ్ దిగ్గజం తొలగించింది.
మొత్తం 12వేల మందికి పైగా ఉద్యోగులను గూగుల్ తొలగించింది. 2022లో సీఈఓ పిచాయ్ కంపెనీని 20శాతం మరింత సమర్థంగా మార్చే ప్రణాళికలను ప్రకటించడంతో తొలగింపులు ప్రారంభమయ్యాయి. గత ఏడాదిలో పునర్నిర్మాణంలో 12వేల కన్నా ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. ఆధునిక గూగుల్‌ను అప్డేట్ చేయడంపై మరింత దృష్టి పెట్టాలని పిచాయ్ కోరారు.
ఏఐ రేసులో ఇతర కంపెనీలతో పోటీ కారణంగా గూగుల్ కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. నివేదిక ప్రకారం.. గూగుల్ బిజినెస్ రెండేళ్లుగా పునర్నిర్మిస్తోంది. టెక్ పరిశ్రమలో పోటీ మధ్య గూగుల్ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని భావిస్తోంది. 2025 కొత్త ఏడాదిలో గూగుల్ లేఆఫ్స్ వచ్చే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ సరిగా లేని ఉద్యోగులను జనవరిలో తొలగించే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.
Read Also : UGC NET 2024 Schedule : యూజీసీ నెట్ 2024 సెషన్ రీషెడ్యూల్ ఇదిగో.. కొత్త తేదీలివే!