Google Payతో బంగారం కొనొచ్చు..అమ్మొచ్చు

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే డిజిటల్ పేమెంట్స్ సర్వీసు ‘గూగుల్ పే’లో కొత్త సదుపాయం తీసుకొచ్చింది.

  • Published By: madhu ,Published On : April 12, 2019 / 07:51 AM IST
Google Payతో బంగారం కొనొచ్చు..అమ్మొచ్చు

Updated On : April 12, 2019 / 7:51 AM IST

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే డిజిటల్ పేమెంట్స్ సర్వీసు ‘గూగుల్ పే’లో కొత్త సదుపాయం తీసుకొచ్చింది.

ఆన్ లైన్ షాపింగ్.. ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు.. ఉన్నచోటనే ఉండి.. నచ్చిన ఐటమ్స్ ను షాపింగ్ చేసుకోనే సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రతిఒక్కరూ ఆన్ లైన్ షాపింగ్ లోనే గంటల కొద్ది గడిపేస్తున్నారు. బట్టలు కొనాలన్నా, ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వాలన్నా అంతా ఆన్ లైన్ లోనే. డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ షాపింగ్ కు ఫుల్ క్రేజ్ వచ్చింది. చివరికి గోల్డ్ కొనాలన్నా గోల్డ్ షాపుకు వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పుడు బంగారం కూడా ఆన్ లైన్‌లో కొనేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి సేవలు పేటీఎం, మొబిక్విక్, పోన్ పే వినియోగదార్లకు అందుబాటులో ఉంది.

ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే డిజిటల్ పేమెంట్స్ సర్వీసు ‘గూగుల్ పే’లో కొత్త సదుపాయం తీసుకొచ్చింది. గూగుల్ పే యూజర్లు తమ యాప్ ద్వారా నేరుగా బంగారం కొనుగోలు చేయొచ్చు. బులియన్ రిఫైనర్ MMTC-PAMP ఇండియాతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. 
Read Also : ఏప్రిల్ 11 నుంచే : PUBG గేమ్ బ్యాన్

గోల్డ్ రిఫైనరీ LBMA  భాగస్వామ్యంతో ఇండియాలోని గూగుల్ పే యూజర్లు 99.99 శాతం స్వచ్చత కలిగిన (24 క్యారెట్ల గోల్డ్)ను కొనుగోలు చేయొచ్చునని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘బంగారం.. భారత సంస్కృతి సాంప్రదాయానికి ఎంతో ముఖ్యమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు వినియోగదారుల దేశంగా ఇండియా దూసుకెళ్తోంది. 

ప్రతి ఏడాది భారతీయులు శుభకార్యాల సమయంలో, అక్షయ త్రుతీయ, దివాళీ సందర్భంగా ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు’ అని గూగుల్ పే ఇండియా డైరెక్టర్ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ అంబరీష్ కెంగే తెలిపారు. గూగుల్ పే నుంచి బంగారు ఎంతమొత్తంలో కొన్నారో అదంతా MMTC-PAMP సెక్యూర్ వాల్ట్ లో స్టోర్ అవుతుంది.

కొనడమే కాదు.. అమ్మొచ్చు కూడా :
అంతేకాదు.. గూగుల్ పే నుంచి బంగారం కొనడమే కాదు.. ఆ బంగారాన్ని లేటెస్ట్ ధరతో అమ్మేయొచ్చు కూడా. ప్రతి కొన్ని నిమిషాలకు గూగుల్ పే యాప్ పై బంగారం రేట్లు డిసిప్లే అవుతాయి. UPI ద్వారా చెల్లింపులు జరిపేందుకు తమ భాగస్వామ్య బ్యాంకులకు సాంకేతిక సేవలు అందిస్తున్నాయని గూగుల్ పే ప్రతినిధి వెల్లడించారు. చెల్లింపు ప్రక్రియలో కానీ, పరిష్కారంలో కానీ తమ పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. 

ఇటీవల ఢిల్లీ హైకోర్టు.. గూగుల్ పే సర్వీసు.. ఆర్బీఐ నుంచి అనుమతి లేకుండా ఎలా ఫైనాన్షియల్ ట్రాన్స్ జెక్షన్ సర్వీసు నిర్వహిస్తుందని ప్రశ్నించింది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కోర్టు… ఆర్బీఐ, గూగుల్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. గూగుల్ పే సర్వీసుకు చట్టపరంగా అవసరమైన అన్నింటికి సమ్మతి లభించినట్టు గూగుల్ ప్రతినిధి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు. 
Read Also : మొబైల్, వెబ్ వెర్షన్ : ‘Jio News’ యాప్ వచ్చేసింది