Google Pixel 9 Pro : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. గూగుల్ పిక్సెల్ 9ప్రోపై బిగ్ డిస్కౌంట్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే..!
Google Pixel 9 Pro : పిక్సెల్ 9 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో మీ బడ్జెట్ ధరలోనే లభ్యమవుతోంది. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
Google Pixel 9 Pro
Google Pixel 9 Pro : కొత్త పిక్సెల్ ఫోన్ కోసం చూస్తున్నారా? పిక్సెల్ 10 సిరీస్ లాంచ్ తర్వాత గూగుల్ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 ప్రో ధర భారీగా తగ్గింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ. 24,500 కన్నా ఎక్కువ భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది.
ఈ లేటెస్ట్ డిస్కౌంట్‌తో పిక్సెల్ 9 ప్రో ధర రూ. 86వేల లోపు (Google Pixel 9 Pro) కొనుగోలు చేయవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు ప్రీమియం డిజైన్, గూగుల్ ఇన్-హౌస్ టెన్సర్ చిప్‌సెట్, మల్టీఫేస్ ట్రిపుల్-కెమెరా సెటప్ పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర తగ్గింపు :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర రూ.1,09,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్ పిక్సెల్ 9 ప్రోపై రూ.21,249 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ధర రూ.88,750కి తగ్గింది. అలాగే, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,750 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు.
Read Also : OnePlus 13R : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13R డీల్ అదిరింది బ్రో.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!
గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో టెన్సర్ G4 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 4,700mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ స్క్రీన్ ఉంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ వస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ పిక్సెల్ ఫోన్ 42MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది.
