Google Pixel 9a Price : సూపర్ డిస్కౌంట్ బ్రో.. గూగుల్ పిక్సెల్ 9a అతి చౌకైన ధరకే.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్!

Google Pixel 9a Price : ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. ఇలా కొనేసుకోండి.

Google Pixel 9a Price : సూపర్ డిస్కౌంట్ బ్రో.. గూగుల్ పిక్సెల్ 9a అతి చౌకైన ధరకే.. ఈ క్రేజీ డీల్ డోంట్ మిస్!

Google Pixel 9a Price

Updated On : October 27, 2025 / 6:17 PM IST

Google Pixel 9a Price : పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తున్నారా? గూగుల్ పిక్సెల్ 9a సరసమైన ధరకే లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ లైనప్‌లోని లేటెస్ట్ చీపెస్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10వేలు తగ్గింపుతో లభ్యమవుతోంది.

క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్, బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ (Google Pixel 9a Price) అందించే అత్యంత ఆకర్షణీయమైన డీల్ అని చెప్పొచ్చు. అదిరిపోయే డిజైన్, సాఫ్ట్‌వేర్ పర్ఫార్మెన్స్, పిక్సెల్ 9a తక్కువ ధరకే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9a డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

గూగుల్ పిక్సెల్ 9a ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9ఎ ఫోన్ రూ.49,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 9aపై రూ.5వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా పిక్సెల్ 9a ధర రూ.44,999కి తగ్గింది. అంతేకాదు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.5వేలు తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Apple iPhone 18 Series : ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో మోడల్స్ ఇవే.. ఈ స్పెషల్ ఫీచర్‌ హైలెట్ అంట..!

పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9a ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 422.2 పీపీఐ వద్ద ఫుల్ HD+ (1080 x 2424 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో వస్తుంది. అలాగే, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. HDR కంటెంట్ కోసం స్క్రీన్ 1800 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ లెవల్స్ అందిస్తుంది. 2700 నిట్స్ వద్ద గరిష్టంగా ఉంటుందని టెక్ దిగ్గజం పేర్కొంది.

పిక్సెల్ 9a ఫోన్ గూగుల్ టెన్సర్ G4 చిప్, 5100mAh బ్యాటరీతో వస్తుంది. ఆప్టిక్స్ పరంగా పిక్సెల్ 9a బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ఫ్రంట్ సైడ్ 13MP కెమెరా కలిగి ఉంది.