Apple iPhone 18 Series : ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో మోడల్స్ ఇవే.. ఈ స్పెషల్ ఫీచర్‌ హైలెట్ అంట..!

Apple iPhone 18 Series : సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ మాదిరిగానే ధర ఉండొచ్చు. బేస్ మోడల్‌ దాదాపు రూ. 82,900, ప్రో వెర్షన్‌కు రూ. 1,34,900 నుంచి ఉండొచ్చు.

Apple iPhone 18 Series : ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోందోచ్.. ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో మోడల్స్ ఇవే.. ఈ స్పెషల్ ఫీచర్‌ హైలెట్ అంట..!

Apple iPhone 18 Series

Updated On : October 27, 2025 / 5:56 PM IST

Apple iPhone 18 Series : ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. దక్షిణకొరియాకు చెందిన కొత్త నివేదిక ప్రకారం.. ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 18 లైనప్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అవుతుందని పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుత ఐఫోన్ మోడళ్లైన ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కన్నా 50 శాతం వరకు హై మెమరీని కలిగి ఉండవచ్చు. కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 17 సిరీస్ 12GB ర్యామ్‌తో వస్తుంది. అయితే, స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ 8GB కలిగి ఉంది.

ఆపిల్ కంపెనీ రాబోయే అన్ని ఐఫోన్ 18 మోడళ్లలో ఒకే టైప్ (Apple iPhone 18 Series) మెమరీ తీసుకురావాలని యోచిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. సాధారణ ఐఫోన్ 18 కూడా 12GB ర్యామ్ పొందే అవకాశం ఉంది. ఆపిల్ 12GB, 16GB కాన్ఫిగరేషన్‌లలో హై పర్ఫార్మెన్స్ అందించే LPDDR5X మెమరీ చిప్‌ మరిన్ని అందించాలని శాంసంగ్‌ను కోరినట్లు తెలిసింది. 2026 లైనప్‌కు తగినంత ర్యామ్ అందించేందుకు కంపెనీ SK హైనిక్స్, మైక్రాన్‌లతో కూడా చర్చలు జరుపుతోంది.

ఆపిల్ ఐఫోన్ 18 లీక్స్ :
డిజైన్ పరంగా ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో సిరీస్ మాదిరిగానే ఒకే సైజులు, అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ ఉండే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ రిఫ్రెష్ లుక్ కోసం బ్లాక్ గ్లాస్‌పై కొత్త ట్రాన్స్‌పరెంట్ ఎండ్ ప్రవేశపెట్టవచ్చు. స్టాండర్డ్ ఐఫోన్ 18 చిన్న డైనమిక్ ఐలాండ్‌ ఉండొచ్చు. ఐఫోన్ ప్రో మోడళ్లకు ఆపిల్ నెక్స్ట్ జనరేషన్ A20 ప్రో చిప్ కావచ్చు.

Read Also : Apple iPhone 16 : కొంటే ఐఫోన్ కొనాల్సిందే.. ఐఫోన్ 16 ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు!

స్పీడ్ పర్ఫార్మెన్స్, పవర్ సామర్థ్యం, ఆకర్షణీయమైన ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు. రెగ్యులర్ ఐఫోన్ 18లో A20 చిప్ ఉండవచ్చు. అది కూడా 2nm ప్రాసెస్‌లోనే ఉంటుంది. కెమెరా అప్‌గ్రేడ్‌లు కూడా ఉండొచ్చు. ఐఫోన్ 18లో 48MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండవచ్చు. శాంసంగ్ కొత్త స్టాక్డ్ CMOS సెన్సార్‌తో వస్తుంది.

భారత్‌లో ఐఫోన్ 18 లాంచ్ టైమ్‌లైన్, ధర :
ఐఫోన్ 18 సిరీస్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ ధర మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. బేస్ మోడల్‌కు దాదాపు రూ. 82,900, ఐఫోన్ ప్రో వెర్షన్‌కు రూ. 1,34,900 నుంచి ప్రారంభమవుతుంది.