Google will now allow users to send video messages in Chat
Google Video Messages : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత చాట్‌లో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది. గూగుల్ చాట్ ద్వారా వినియోగదారులను సులభంగా వీడియో మెసేజ్‌లను పంపుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ వినియోగదారుల మధ్య కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేస్తుంది. మీరు సేల్స్ టీమ్‌లో భాగమైనా, కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అయినా లేదా ప్రాజెక్ట్ గురించి షేర్ చేసే టీమ్ మెంబర్ అయినా ఈ ఫీచర్ మీ సమయాన్ని మరింత ఆదా చేస్తుంది. ఇంతకీ ఈ వీడియో మెసేజ్ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వీడియో మెసేజ్ ఫీచర్ ఎలా వాడాలంటే? :
ఈ వీడియో మెసేజ్‌లను డైరెక్ట్ మెసేజ్‌లు (DM), గ్రూప్ చాట్‌లు, స్పేస్‌లలో కూడా షేర్ చేయవచ్చు. మీరు టెక్స్ట్ మెసేజ్‌ల మాదిరిగానే ఇతర యూజర్లతో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. కోట్ చేయడం, రియాక్ట్ లేదా థ్రెడ్‌లో రిప్లయ్ ఇవ్వడం చేయొచ్చు. ప్రస్తుతానికి, మీరు వెబ్‌లో మాత్రమే వీడియో మెసేజ్‌లను రికార్డ్ చేయవచ్చు. అలాగే ఇతరులకు పంపవచ్చు. కానీ, మొబైల్ యూజర్లు వాటిని స్వీకరించగలరు. చూడగలరు. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లకు ఈ ఫీచర్లను విస్తరించాలని గూగుల్ యోచిస్తోంది.
ఈ ఫీచర్‌ని ఎవరు యాక్సెస్ చేయగలరంటే? :
వీడియో మెసేజింగ్ ఫీచర్ ప్రత్యేకించి గూగుల్ వర్క్‌స్పేస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
ఈ ఫీచర్ అక్టోబర్ 7న ర్యాపిడ్ రిలీజ్ డొమైన్‌లలో ప్రారంభమైంది. ఇతర డొమైన్‌లకు అక్టోబర్ 25, 2024 నుంచి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులందరూ తమ గూగుల్ చాట్‌లో ఫీచర్‌ని చూసేందుకు 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు. ప్రస్తుతం క్రోమ్ఓఎస్, లైనెక్స్, ఫైర్‌ఫాక్స్ వంటి నిర్దిష్ట సిస్టమ్‌లలో వీడియో మెసేజ్‌లు రికార్డ్ చేయలేరు.
అయితే, గూగుల్ త్వరలో ఈ ఫీచర్‌కి ట్రాన్స్‌క్రిప్షన్ సర్వీసులను కూడా యాడ్ చేయాలని భావిస్తోంది. తద్వారా మెసేజ్ చదవడమే కాకుండా యూజర్లు వీడియో మెసేజ్‌లకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. చాట్‌లో గూగుల్ కొత్త వీడియో మెసేజింగ్ ఫీచర్ ద్వారా బిజినెస్ అప్‌డేట్‌లు, టీమ్ ప్రాజెక్ట్‌లతో యూజర్లు కమ్యూనికేట్ చేయొచ్చు.
Read Also : UPI 123Pay Limit : ఆర్బీఐ ఎంపీసీలో కీలక నిర్ణయాలు.. యూపీఐ లైట్, యూపీఐ 123పే లావాదేవీల పరిమితి పెంపు..!