Lava Agni 3 First Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా అగ్ని 3 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు..!

Lava Agni 3 First Sale : భారత మార్కెట్లో లావా అగ్ని 3 లాంచ్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. లావా 8జీబీ+128జీబీ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా రూ. 20,999, ఛార్జర్‌తో రూ. 22,999కి అందిస్తోంది.

Lava Agni 3 First Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా అగ్ని 3 ఫస్ట్ సేల్ మొదలైందోచ్.. ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు..!

Lava Agni 3 first sale in India today_ Pricing, offers and more

Updated On : October 9, 2024 / 3:39 PM IST

Lava Agni 3 First Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లావా సరికొత్త ఫోన్ అగ్ని 3 ఫస్ట్ సేల్ మొదలైంది. ఇటీవలే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లావా అగ్ని 3ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం 2 స్టాండ్‌అవుట్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఇందులో ఐఫోన్ మాదిరిగా యాక్షన్ కీ, కెమెరా మాడ్యూల్‌లో సెకండరీ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ సేల్ అమెజాన్, లావా హోమ్-వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

లావా అగ్ని 3 ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. లావా ఫస్ట్ సేల్ సందర్భంగా అన్ని వేరియంట్లపై కొన్ని డిస్కౌంట్లను అందిస్తోంది. లావా అగ్ని 3 ఫోన్ 128జీబీ, 256జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. అదనంగా, కొనుగోలుదారులు ఛార్జర్ లేకుండా తక్కువ ధరకు లావా ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

Read Also : Lava Agni 3 Launch : డ్యూయల్ డిస్‌ప్లే, ఐఫోన్ మాదిరి యాక్షన్ బటన్‌తో లావా అగ్ని 3 ఫోన్ వచ్చేసింది.. భారత్‌లో ధర ఎంతంటే?

లావా అగ్ని 3 ధర, బ్యాంక్ ఆఫర్లు :
భారత మార్కెట్లో లావా అగ్ని 3 లాంచ్ ధర రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది. లావా 8జీబీ+128జీబీ వేరియంట్‌ను ఛార్జర్ లేకుండా రూ. 20,999, ఛార్జర్‌తో రూ. 22,999కి అందిస్తోంది. 8జీబీ+256జీబీ వేరియంట్ రూ.24,999కి అందుబాటులో ఉంటుంది. కాంటాక్టు ఆఫర్‌తో ప్రతి మోడల్‌కు రూ. 2వేలు తగ్గింపు, బాక్స్‌లో ఛార్జర్ లేని వేరియంట్‌పై రూ. వెయ్యి తగ్గింపు కూడా పొందవచ్చు.

  •  8జీబీ+128జీబీ (ఛార్జర్ లేకుండా) రూ. 19,999
  •  8జీబీ+128జీబీ (ఛార్జర్‌తో) రూ. 20,999
  •  8జీబీ+256జీబీ రూ. 22,999.
  • అదనంగా, అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ. 1,150 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

లావా అగ్ని 3 కీలక స్పెషిఫికేషన్ల, ఫీచర్లు :
ముందుగా లావా ఫోన్ ప్రత్యేక ఫీచర్ల గురించి మాట్లాడితే.. పవర్ బటన్ పైన యాక్షన్ కీ ఐఫోన్ 16 సిరీస్ మాదిరిగానే పనిచేస్తుంది. మీ అవసరానికి తగినట్టుగా కీని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ లావా అగ్ని ఫోన్ 3 గెచర్స్ కలిగి ఉంది. సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, లాంగ్ ప్రెస్ ద్వారా నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కెమెరా మాడ్యూల్‌లో సెకండరీ స్క్రీన్ మరో ప్రత్యేకమైన ఫీచర్. ఈ ఇన్‌స్టాస్క్రీన్‌తో మీరు నోటిఫికేషన్‌లను చూడవచ్చు. కొత్త యానిమేషన్ ఫైరీతో ఆడుకోవచ్చు. ఇన్‌స్టాస్క్రీన్ స్టాప్‌వాచ్, టైమర్‌ కూడా ఉంది. సెల్ఫీలు క్లిక్ చేసే విధానం కూడా మార్చుకోవచ్చు.

డిజైన్‌ విషయానికి వస్తే.. ఈ ఫోన్ గ్లాస్ బ్యాక్ గ్రిప్ కలిగి ఉంది. ఈ అడ్వాన్స్‌డ్ డిజైన్ స్టైల్, ఫంక్షనాలిటీతో వస్తుంది. భారతీయ మార్కెట్‌లో లావా అగ్ని 3 ఫోన్ ప్రిస్టిన్ వైట్, హీథర్ బ్లూ అనే మొత్తం రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. లావా అగ్ని 3 డిస్‌ప్లే కర్వడ్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో రెండు అమోల్డ్ స్క్రీన్‌లు ఉన్నాయి. 6.78-అంగుళాల 120Hz ఫ్రంట్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ 1.74-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే కూడా కలిగి ఉంది. 8జీబీ ర్యామ్, హుడ్ కింద మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 1, ఐక్యూ జెడ్9ఎస్, మోటో ఎడ్జ్ 50 నియోతో పోటీపడుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 3ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. అగ్ని సిరీస్ మూడో మోడల్ బ్లోట్‌వేర్-ప్రీ యూఐని కలిగి ఉంది. లావా అగ్ని 3 క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ (ఓఐఎస్), 8ఎంపీ అల్ట్రావైడ్, 8ఎంపీ టెలిఫోటో (3ఎక్స్ జూమ్), 16ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 66డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

Read Also : Apple iPhone SE 4 : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. ఐఫోన్ SE 4 వచ్చేది ఎప్పుడంటే? ఏయే అప్‌గ్రేడ్స్ ఉండొచ్చుంటే?