Free LPG Cylinders : దీపావళికి ఫ్రీగా ఎల్‌పీజీ సిలిండర్లు.. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేయాలో తెలుసా?
Free LPG Cylinders : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Govt Announces Free LPG Cylinders For Diwali
Free LPG Cylinders : పండుగల సీజన్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీపావళికి ముందే ఉచిత సిలిండర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే, యూపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ప్రణాళికలను ప్రకటించింది.
దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు :
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి దీపావళికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. యూపీ ప్రభుత్వం గతంలో హోలీ, దీపావళి సందర్భంగా లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లను ప్రకటించింది. ఈ దీపావళికి రాష్ట్రంలోని 1,84,039 మంది లబ్ధిదారులకు ఉచితంగా వంటగ్యాస్ సిలిండర్లు అందజేయనున్నారు.
ప్రయోజనం ఎలా పొందాలంటే? :
ఈ ప్రయోజనాన్ని పొందడానికి కనెక్షన్ హోల్డర్లు గ్యాస్ సిలిండర్ కోసం పూర్తి మొత్తాన్ని ముందుగా చెల్లించాలి. 3 నుంచి 4 రోజుల్లో, వినియోగదారు బ్యాంకు అకౌంటుకు మొత్తం డబ్బు తిరిగి చెల్లించడం జరుగుతుంది.
ఫ్రీ గ్యాస్ సిలిండర్‌కు ఎవరు అర్హులు? :
వెరిఫైడ్ ఆధార్‌తో ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద రిజిస్టర్ చేసుకున్న ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు. మీరు ఇంకా మీ ఇ-కేవైసీని పూర్తి చేయకపోతే.. ఈ ప్రయోజనం కోసం అర్హత పొందేందుకు ఆధార్ వెరిఫై చేసుకోవాలి. అనంతరం మీ గ్యాస్ ఏజెన్సీని సందర్శించండి.
ఫ్రీ సిలిండర్ కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే? :
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రకటన అనంతరం ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా ఈ దీపావళికి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు ఉచిత సిలిండర్లను అందించనున్నాయి. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే.. ఉజ్వల యోజన కింద రిజిస్టర్ చేసుకోవాలి.
మీ సమీప కామన్ సర్వీస్ సెంటర్ లేదా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌ని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ప్రధానంగా మహిళల కోసం రూపొందించింది. రిజిస్టర్ చేసుకోనేందుకునిర్దిష్ట అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఉజ్వల యోజన కింద లబ్ధిదారులు ఇప్పటికే సాధారణ వినియోగదారుల కన్నా తక్కువ ధరకు సిలిండర్‌లను పొందుతున్నారు. ఒక్కో సిలిండర్‌కు దాదాపు రూ. 300 సబ్సిడీతో నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది.