ఓర్నీ.. ఈ రకంగా కూడా చేస్తారా?.. ఐఫోన్, ఆండ్రాయిడ్‌లో ఓలా, ఉబర్ బుక్ చేసేవాళ్లు ఇది చూడాల్సిందే..

ఐఫోన్, ఆండ్రాయిడ్ ధరల వ్యత్యాసాలపై ప్రభుత్వం ఓలా, ఉబర్‌లకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి చాలా మంది తమ సోషల్ మీడియాలో దీనికి లైవ్ ఫ్రూప్ కూడా అప్‌లోడ్ చేశారు.

ఓర్నీ.. ఈ రకంగా కూడా చేస్తారా?.. ఐఫోన్, ఆండ్రాయిడ్‌లో ఓలా, ఉబర్ బుక్ చేసేవాళ్లు ఇది చూడాల్సిందే..

Ola, Uber over price disparities

Updated On : January 23, 2025 / 7:55 PM IST

Ola, Uber price disparities : ఓలా, ఉబర్ బుకింగ్ చేసుకుంటున్నారా? జర జాగ్రత్త.. గత కొన్ని నెలలుగా, ఉబెర్, ఓలా బుకింగ్ ధరల్లో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలోనే కంపెనీలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లకు ఒకోలా.. ఐఫోన్ యూజర్లకు మరోలా బుకింగ్ రేట్లు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇదే విషయంలో నెటిజన్ల నుంచి కూడా నిత్యం ప్రశ్నలు సంధిస్తున్నారు.

వినియోగదారులు ఉపయోగించే మొబైల్ డివైజ్ బట్టి విభిన్న ధరలను నిర్ణయించడం పట్ల ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబెర్‌లపై వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్య తీసుకుంది. ఐఫోన్, ఆండ్రాయిడ్ ధరల వ్యత్యాసాలపై ప్రభుత్వం ఓలా, ఉబర్‌లకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి చాలా మంది తమ సోషల్ మీడియాలో దీనికి లైవ్ ఫ్రూప్ కూడా అప్‌లోడ్ చేశారు.

Read Also : వావ్ సూపర్ టిప్.. క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు మాఫీ చేసుకోవచ్చట ఇలా..!

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్‌లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. “వినియోగిస్తున్న వివిధ మోడళ్ల (#iPhones/ #Android) మొబైల్‌ల ఆధారంగా స్పష్టమైన #డిఫరెన్షియల్ ప్రైసింగ్‌ను గతంలో పరిశీలించిన తర్వాత CCPA ద్వారా ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లకు నోటీసులు జారీ చేసింది. #Ola, #Uber స్పందించాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ప్లాట్‌ఫారమ్‌లు వారి డివైజ్ టైప్ బట్టి వినియోగదారులకు ధరల తేడాలు ఎలా ఉంటాయి అనేదానిపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కస్టమర్‌లు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ డివైజ్ ఉపయోగిస్తున్నారా అనేదానిపై ఆధారపడి ఒకే విధమైన రూట్‌లు, సమయాల ఆధారంగా ఛార్జీలు మారవచ్చని నివేదికలు సూచించాయి.

అసలేం జరిగిందంటే? :
దేశంలో ఉబర్, ఓలా ధరల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సిరీస్‌లో, ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా, ఉబర్ వంటి రైడ్-హెయిలింగ్ యాప్‌లపై విభిన్న ధరలకు సంబంధించిన పోస్ట్‌ను షేర్ చేశారు. వివిధ పరికరాలు, బ్యాటరీ స్థాయిలలో ఛార్జీలను పోల్చాడు. ఆ తర్వాత, ఉబెర్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.

ధరల్లో ఇంత తేడానా? :
గతంలో, ఆండ్రాయిడ్ వినియోగదారులతో పోలిస్తే.. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులకు ఉబెర్ అధిక ఛార్జీలు వసూలు చేస్తుందని సోషల్ మీడియా వినియోగదారు ఆరోపించినట్లు తెలిసింది. ఒకే ఉబెర్ ఆటో రైడ్‌కు వేర్వేరు ధరలతో రెండు వేర్వేరు మొబైల్ ఫోన్‌లలో చూపించే ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆండ్రాయిడ్ డివైజ్ ధర రూ.290.79గా చూపించింది. అయితే, ఆపిల్ ఐఫోన్ ఒకే విధమైన ప్రయాణానికి రూ. 342.47 అధిక ఛార్జీని సూచించింది.

ఉబర్ ఛార్జీలపై నెటిజన్ స్పందన :
సోషల్ మీడియా యూజర్ సుధీర్, ఉపయోగించిన ఫోన్ ఆధారంగా ఉబర్‌లో ఛార్జీల వ్యత్యాసాలు ఉన్నాయని తన అనుభవాన్ని షేర్ చేశాడు. “ఒకే పికప్ పాయింట్, గమ్యం, సమయం, కానీ రెండు వేర్వేరు ఫోన్‌లు రెండు వేర్వేరు రేట్లు చూపుతాయి. నా కుమార్తె ఫోన్‌తో పోలిస్తే.. నా ఉబర్‌లో ఎక్కువ ఛార్జీలు ఉంటున్నాయి. నా రైడ్‌లను బుక్ చేయమని నేను ఆమెను తరచుగా అడుగుతాను. మీకు ఇలా జరుగుతుందా దాన్ని నివారించే ఉపాయం ఏంటి?” అని ఆయన పేర్కొన్నారు.

ఉబెర్ నిరాకరణ :
ఫోన్ టైప్ ఆధారంగా ఛార్జీలలో ఎలాంటి తేడా లేదని ఉబర్ తెలిపింది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఓలా, ఉబర్, రాపిడో వంటి ప్లాట్‌ఫారమ్‌లపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ తీవ్రమైన ఆరోపణలు ఈ కంపెనీలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read Also : Restaurant industry : దేవుడా.. జొమాటో, స్విగ్గీ ఇంత పనిచేస్తుందా? నేషనల్ వైడ్ భారీ దెబ్బ పడనుందా?