ఎయిర్ టెల్ కు షాక్ : నెట్వర్క్ మారిన 5.7 కోట్ల వినియోగదారులు

  • Published By: chvmurthy ,Published On : February 1, 2019 / 12:38 PM IST
ఎయిర్ టెల్ కు షాక్ : నెట్వర్క్ మారిన 5.7 కోట్ల వినియోగదారులు

Updated On : February 1, 2019 / 12:38 PM IST

ఢిల్లీ: దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కు 2018 డిసెంబర్ నెలలో ఊహించని షాక్ తగిలింది. డిసెంబర్ లో 5.7 కోట్ల మంది  వినియోగదారులు ఎయిర్ టెల్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు మారారు.  నవంబర్ లో 34.1 కోట్ల మంది వినియోగదారులున్న ఎయిర్ టెల్, డిసెంబర్ నాటికి 28.42 కోట్లకు పడిపోయింది.  

కాగా….ఆకర్షణీయమైన ప్లాన్ లతో అతి తక్కువ ధరలతో వినియోగదారులకు చేరువైన జియో డిసెంబర్ చివరి నాటికి 28 కోట్ల వినియోగదారులను కలిగి ఉంది. అంటే రెండు కంపెనీల మధ్య ఉన్న వినియోదారుల వ్యత్యాసం కేవలం 42 లక్షలే.