HMD View Design Leaked : హెచ్ఎండీ వ్యూ ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక ఫీచర్లు లీక్..!

HMD View Design Leak : ఈ మాడ్యూల్ కలర్ ప్యానెల్ కన్నా బ్రైట్ కలర్ ఆప్షన్లలో ఉంటుంది. రెండు కెమెరా యూనిట్లు, ఎల్ఈడీ ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది.

HMD View Design Leaked : హెచ్ఎండీ వ్యూ ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక ఫీచర్లు లీక్..!

HMD View Design Leaked; Colour Options ( Image Source : Google )

Updated On : July 7, 2024 / 4:01 PM IST

HMD View Design Leaked : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? రాబోయే కొద్ది నెలల్లో మార్కెట్‌లోకి హెచ్ఎండీ వ్యూ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. హెచ్ఎండీ సెల్ఫ్-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి కావచ్చు. ఇటీవల, నోకియా లూమియా లాంటి హెచ్ఎండీ స్కైలైన్ గురించి వివరాలు వైరల్ అయ్యాయి.

Read Also : HMD Pulse Arrow : భారత్‌కు హెచ్ఎండీ ‘యారో’ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. హెచ్ఎండీ పల్స్‌కు రీబ్రాండెడ్ వెర్షన్!

హెచ్ఎండీ వ్యూ మోనికర్, డిజైన్, లీకైన ఫీచర్‌లతో పాటు ఆన్‌లైన్‌లో కనిపించింది. ఈ హ్యాండ్‌సెట్ కలర్ ఆప్షన్లను కూడా రివీల్ చేసింది. అయితే, ఫోన్ లాంచ్ టైమ్‌లైన్ గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

హెచ్ఎండీ వ్యూ డిజైన్, కలర్ ఆప్షన్లు (అంచనా) :
హెచ్ఎండీ లీకైన డిజైన్ రెండర్‌లు, హెచ్ఎండీ వ్యూ ముఖ్య ఫీచర్లను షేర్ చేసింది. బ్యాక్ ప్యానెల్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లో గుండ్రని అంచులతో దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌తో ఫోన్ లీక్‌లో కనిపిస్తుంది. ఈ మాడ్యూల్ కలర్ ప్యానెల్ కన్నా బ్రైట్ కలర్ ఆప్షన్లలో ఉంటుంది. రెండు కెమెరా యూనిట్లు, ఎల్ఈడీ ఫ్లాష్‌ను కలిగి ఉంటుంది.

హెచ్ఎండీ వ్యూ లీక్డ్ డిజైన్ కూడా వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ రైట్ ఎడ్జ్ ఉంటుంది. హెచ్ఎండీ బ్రాండింగ్ బ్యాక్ ప్యానెల్ మధ్యలో కూడా కనిపిస్తుంది. మెటోర్ బ్లాక్, ఐస్, వెల్వెట్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఫోన్ రానుంది. చివరి రెండు ఆప్షన్లలో లీక్‌ డేటా సూచిస్తుంది.

హెచ్ఎండీ వ్యూ ఫీచర్లు (అంచనా) :
హెచ్ఎండీ వ్యూ ఫుల్- హెచ్ఎడీ+ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా అందిస్తుందని భావిస్తున్నారు. హెచ్ఎండీ వ్యూ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ ద్వారా లీడ్ అవుతుందని భావిస్తున్నారు. లీక్ ప్రకారం.. ఈ హ్యాండ్‌సెట్ 4,700mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read Also : HMD Feature Phones : ఇన్‌బిల్ట్ యూపీఐ సపోర్టుతో హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 కొత్త ఫీచర్ ఫోన్లు.. ధర ఎంతంటే?