Honda Activa Limited Edition : కొత్త బైక్ కావాలా? దిమ్మతిరిగే ఫీచర్లతో హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?

Honda Activa Limited Edition : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ రూ. 80వేల ధరలో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

Honda Activa Limited Edition : కొత్త బైక్ కావాలా? దిమ్మతిరిగే ఫీచర్లతో హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?

Honda Activa Limited Edition launched at Rs 80,734, Check Full Details

Honda Activa Limited Edition : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) ఈరోజు హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్‌ను రూ. 80,734 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ప్రారంభ ధర వద్ద లాంచ్ చేసింది. కొత్త స్కూటర్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో పరిమిత కాలానికి అందుబాటులో ఉంటుంది. హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ DLX, Smart అనే 2 వేరియంట్లలో అందిస్తోంది. వాటి ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

Read Also : Disney Plus Sharing Password : నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై యూజర్లు వారితో పాస్‌వర్డ్ షేరింగ్ చేయలేరు..!

* యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ DLX – రూ. 80,734
* యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ – రూ. 82,734

పరిమిత ఎడిషన్ స్కూటర్‌లో మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అందులో డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్‌లను కలిగి ఉంది. HMSI ఉత్పత్తిలో మొదటిదిగా చెప్పవచ్చు. ఇవన్నీ బాడీ ప్యానెల్స్‌పై షేడ్లతో కలిపి స్పోర్టినెస్‌ని పెంచుతాయి.

అదనంగా, బ్లాక్ క్రోమ్ గార్నిష్‌తో కూడిన Activa 3D ఐకాన్ కూడా ఉంది. DLX వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్ హోండా స్మార్ట్ కీ ఫీచర్‌ను పొందుతుంది. హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్ హార్ట్‌లో 109.51cc, PGM-Fi, 4-స్ట్రోక్, SI ఇంజిన్ ఉంది. 7.74hp గరిష్ట శక్తిని 8.90Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

Honda Activa Limited Edition launched

Honda Activa Limited Edition launched

HMSI హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్‌పై ప్రత్యేక 10ఏళ్ల వారంటీ ప్యాకేజీని (3-ఏళ్ల ప్రామాణిక + 7ఏళ్ల ఆప్షనల్) అందిస్తోంది. (Activa) భారతీయ ద్విచక్ర వాహనాల విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గత 2 దశాబ్దాలుగా మిలియన్ల మంది భారతీయులను ఆనందపరిచింది.

అన్ని వయసుల వారి ఆదరణను కొనసాగిస్తూ భారత్‌లో అత్యంత ఇష్టపడే స్కూటర్‌గా అవతరించింది. అందులో ఆసక్తిగల కస్టమర్లు, ముఖ్యంగా కొత్త జనరేషన్ కొనుగోలుదారులే ఎక్కువగా ఉన్నారని HMSI మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈఓ సుత్సుము ఒటాని అన్నారు.

Read Also : Google Earthquake Alert System : భారతీయ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘భూకంప హెచ్చరిక వ్యవస్థ’.. రియల్ టైమ్ అప్‌డేట్స్ పంపుతుంది.. ఇదేలా పనిచేస్తుందంటే?