Honda SP160 Launch : కొత్త బైకు కొంటున్నారా? ఈ హోండా ఎస్పీ160 2025 ధర ఎంతంటే? పూర్తి వివరాలివే!

Honda SP160 Launch
Honda SP160 Launch : కొత్త బైక్ కోసం చూస్తు్న్నారా? ప్రముఖ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త ఓబీడీ2బీ-కంప్లైంట్ హోండా SP160 2025 బైకును లాంచ్ చేసింది. ఈ కొత్త బైకు ప్రారంభ ధర రూ. 1,21,951 (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఈ మోటార్‌సైకిల్ ఇప్పుడు అప్‌డేట్ ఇంజన్, అదనపు ఫీచర్లను కలిగి ఉంది.
హోండా ఎస్పీ160 2025 బైకు 162.71సీసీ, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు ఓబీడీ2బీ-కంప్లైంట్ బైకులో ఇంజన్ గరిష్టంగా 13హెచ్‌పీ శక్తిని, 14.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఈ మోటార్‌సైకిల్ కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్, మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఏరోడైనమిక్ అండర్-కౌల్, క్రోమ్ కవర్‌తో కూడిన మఫ్లర్ వంటి ఫీచర్లతో వస్తుంది. రియల్ టైమ్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, హోండా రోడ్‌సింక్ యాప్ సపోర్టుతో కూడిన కొత్త 4.2-అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే ఉంది. మీరు కొత్త యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా పొందవచ్చు.
హోండా ఎస్పీ160 2025 మొత్తం 4 కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వేరియంట్ వారీగా హోండా ఎస్పీ160 2025 ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
- సింగిల్ డిస్క్ : రూ. 1,21,951
- డబుల్ డిస్క్ : రూ. 1,27,956