Interest Free Home Loan: ఇంట్రస్ట్ లేకుండా హోమ్ లోన్ తీసుకోవడం ఎలా? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

Interest Free Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే వడ్డీ లేకుండా హోం లోన్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? అసలు వడ్డీ ఆశించకుండా ఏ బ్యాంకులు గృహరుణాలు ఇస్తాయని అంటారా? అయితే, మీరు ఈ స్టోరీని తప్పక చదవాల్సిందే.

Interest Free Home Loan: ఇంట్రస్ట్ లేకుండా హోమ్ లోన్ తీసుకోవడం ఎలా? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!

How to Make Your Home Loan Interest Free

Updated On : February 17, 2025 / 3:47 PM IST

Home Loan Interest Free : కొత్త ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? బ్యాంకులో హోం లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, అసలు వడ్డీ లేకుండా హోం లోన్ ఎలా తీసుకోవాలో తెలుసా? చాలామందికి ఇల్లు కొనడం అనేది ఒక కల. ఎందుకంటే మన సమాజంలో సొంత ఇల్లు కలిగి ఉండటం అనేది జీవితంలో ఉన్నతిస్థితిని సూచిస్తుంది.

అద్దె ఇంట్లో నివసించే వారు ఎక్కువగా ఈ విషయంలోనే నిరాశ చెందుతారు. తమ సొంత ఇల్లు కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు నిరంతరం ఒత్తిడి చేస్తారు. చాలా నగరాల్లోని ఆకాశన్నంటుతున్న రియల్ ఎస్టేట్ ధరలతో కలిపి ఇల్లు కొనాలనే ఈ ఒత్తిడి వల్ల చాలా మంది ఈ కలను నిజం చేసుకోవడానికి గృహ రుణాలపై ఆధారపడాల్సి వస్తుంది.

Read Also : PM Kisan 19th Installment : ఈ నెల 24నే పీఎం కిసాన్ డబ్బులు.. కానీ, ఈ రైతులకు రూ. 2వేలు పడవు.. ఏం చేయాలంటే?

అంతేకాకుండా, చాలా మంది సొంత ఇల్లు కొనాలని కోరుకుంటారు. అంటే తీసుకున్న గృహ రుణాలు భారీగా ఉంటాయి. భారీ రుణాలతో పాటు భారీ వడ్డీ ఖర్చులు కూడా వస్తాయి. కానీ, మీ గృహ రుణాన్ని వడ్డీ లేకుండా చేసేందుకు ఒక అద్భుతమైన మార్గం ఉందని చెబితే ఎగిరి గంతేస్తారు. మీరు నమ్మడం లేదా? కదా సరే, అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గృహ రుణాలతో భారీ వడ్డీల భారం :
చాలా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మీ ఇంటికి చెల్లించాల్సిన ఈఎంఐనే ఎక్కువగా సూచిస్తాయి. తద్వారా మీరు ఆ ఇంటిని కొనుగోలు చేయగలరని మిమ్మల్ని నమ్మిస్తారు. మీరు నెలవారీ ఈఎంఐలను భరించగలిగినా ఈ రుణాల ప్రీమియం భారీగా ఉంటుంది.

చాలా సందర్భాలలో, దీర్ఘకాలిక రుణానికి రుణ మొత్తంపై చెల్లించే వడ్డీ రుణ మొత్తం కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. 20 ఏళ్ల కాలపరిమితికి 9శాతం వడ్డీకి రూ. 40 లక్షల గృహ రుణం తీసుకుంటే.. నెలకు 35,989 చొప్పున మొత్తానికి రూ. 46.37 లక్షలు చెల్లించాలి. వడ్డీతో కలిపి మొత్తంగా రూ.86.37 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

మీరు 20 ఏళ్లకు నెలవారీ ఈఎంఐ చెల్లిస్తూ ఉంటే.. మీరు మొత్తం రూ. 86.37 లక్షలు చెల్లిస్తారు. ఈ రూ. 46.37 లక్షలు అదనంగా మీరు చెల్లించే వడ్డీ. మీరు వడ్డీగా తీసుకున్న దానికంటే అసలు మొత్తంతో కలిపి ఎక్కువ చెల్లిస్తారు. అయితే, వడ్డీని వదిలించుకునే మార్గమే లేదు.

ఎందుకంటే.. రుణ వ్యవస్థ పనిచేసే విధానం ఇలానే ఉంటుంది. మీ దగ్గర మొత్తం డబ్బులు ఉండే వరకు మీరు ఇల్లు కొనకూడదా? మీకు వీలైతే, అలాంటిదేమీ ఉండదు. కానీ, మనలో చాలా మందికి, ఇది ఆచరణీయమైన ఎంపిక కాకపోవచ్చు.

Read Also : SIP vs Lump Sum Investment : ఐదేళ్లలో కోటి రూపాయలు టార్గెట్.. SIP, Lumsum ఇంకా ఏయే మార్గాలున్నాయ్.. నెలకి ఎంత పెట్టాలి?

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు చెల్లించే వడ్డీ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. మ్యూచువల్ స్కీమ్‌లో మీ గృహ రుణ మొత్తంలో 10శాతం SIPలో పెట్టుబడి ద్వారా మీరు వడ్డీ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.

మీరు నెలవారీ రూ. 4వేలు (రుణ మొత్తంలో 0.10శాతం) SIPని ప్రారంభిస్తే.. 15 శాతం సగటు వార్షిక రాబడితో మీ పెట్టుబడులు 20 సంవత్సరాలలో మొత్తం రూ. 59.88 లక్షలకు పెరుగుతాయి. ఈ కార్పస్ నుంచి మీరు పెట్టుబడి పెట్టిన రూ. 9.6 లక్షలను తీసివేసినా మీ చేతుల్లో రూ. 50.28 లక్షలు ఉంటాయి. మీరు చెల్లించే వడ్డీని కవర్ చేయడానికే సరిపోతుంది అనమాట.

20 ఏళ్లకు రూ. 20 లక్షల రుణం :
20 సంవత్సరాలకు మొత్తంగా రూ. 20 లక్షల రుణం తీసుకుంటే.. నెలకు ఈఎంఐ రూ. 17,995 చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ మొత్తానికి రూ.23.18 లక్షలు చెల్లించాలి. అయితే SIP మొత్తంగా (0.10శాతం)తో నెలవారీగా రూ. 2వేలు అవుతుంది. 20ఏళ్లకు మొత్తం రాబడి వచ్చేసి రూ. 29.94 లక్షలకు పెరుగుతుంది. అదే పెట్టుబడిలో రూ.4.8 లక్షలు తీసివేస్తే.. మీ చేతుల్లో రూ. 25.14 లక్షలు ఉంటాయి.

20 ఏళ్లకు రూ. 70 లక్షల రుణం :
మీరు నెలవారీ రూ. 7,000 (రుణ మొత్తంలో 0.10%) SIPని ప్రారంభిస్తే.. 15శాతం సగటు వార్షిక రాబడితో మీ పెట్టుబడులు 20 సంవత్సరాలలో మొత్తం రూ. 1.04 కోట్లకు పెరుగుతాయి. ఈ కార్పస్ నుంచి మీరు పెట్టుబడి పెట్టిన రూ. 16.80 లక్షలను తీసివేసినప్పటికీ, మీ చేతుల్లో రూ. 88 లక్షలు ఉంటాయి.

20 ఏళ్లకు రూ. కోటి రుణం :
మీరు నెలవారీ రూ. 10వేలు (రుణ మొత్తంలో 0.10%) SIPని ప్రారంభిస్తే.. 15శాతం సగటు వార్షిక రాబడితో మీ పెట్టుబడులు 20 సంవత్సరాలలో మొత్తం రూ. 1.49 కోట్లకు పెరుగుతాయి. ఈ కార్పస్ నుంచి మీరు పెట్టుబడి పెట్టిన రూ. 24 లక్షలను తీసివేసినప్పటికీ, మీ చేతుల్లో రూ. 1.25 లక్షలు ఉంటాయి.