ICICI Pru iProtect Smart: ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్ ఎన్ గెయిన్’ను విడుదల చేసిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్
ఈక్విటీ, డెట్‌లో 18 ఫండ్ ఆప్షన్‌లను అందించడం ద్వారా కస్టమర్‌లు గరిష్ట రాబడిని పొందేలా చేస్తుంది. ఇది పాలసీ వ్యవధిలో కుటుంబానికి పూర్తి ఆర్థిక రక్షణ, సర్వైవల్ సమయంలో గణనీయమైన మొత్తంలో నగదు పొందేలా ఇది తోడ్పడుతుంది

ICICI Prudential Life Insurance: ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ సరికొత్త ప్రోడక్ట్ ఐసిఐసిఐ ప్రు ప్రొటెక్ట్ ఎన్ గెయిన్ ను విడుదల చేసింది. ఇది సమగ్ర జీవిత బీమా కవరేజి అందించటంతో పాటుగా ప్రమాదవశాత్తు మరణం, ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం వంటి వాటిరి రక్షణ అందిస్తుంది. అలాగే దీర్ఘకాలిక సంపదను నిర్మించడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మార్కెట్ ఆధారిత రాబడిని సైతం అందిస్తుంది.
Esha Gupta : ఈషా గుప్తా కూడా సమంతలా బాధపడుతుందా..? ఆమె తీసుకున్న హైపర్బేరిక్ థెరపీనే ఈమె కూడా..!
ఈ పథకం వార్షిక ప్రీమియం కంటే 100 రెట్లు అధిక జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. ఈక్విటీ, డెట్‌లో 18 ఫండ్ ఆప్షన్‌లను అందించడం ద్వారా కస్టమర్‌లు గరిష్ట రాబడిని పొందేలా చేస్తుంది. ఇది పాలసీ వ్యవధిలో కుటుంబానికి పూర్తి ఆర్థిక రక్షణ, సర్వైవల్ సమయంలో గణనీయమైన మొత్తంలో నగదు పొందేలా ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, కస్టమర్‌లకు వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రక్షణ, దీర్ఘకాలిక పొదుపు ఖచ్చితమైన సమ్మేళనాన్ని అందిస్తుంది.
వెల్లడించిన ఆదాయం ఆధారంగా పాలసీలను జారీ చేయగల కొనుగోలు ప్రక్రియను కంపెనీ సులభతరం చేసింది. ప్రత్యేకంగా, 45 ఏళ్లలోపు కస్టమర్‌లు శారీరక వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రమాదం కారణంగా పాలసీదారు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా, కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవడం కోసం లైఫ్ కవర్ లేదా క్లెయిమ్ మొత్తం లబ్ధిదారు/నామినీకి ఏకమొత్తంగా చెల్లించబడుతుంది.