బంగారం కొంటున్నారా? మోసపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Tips to Know Before Purchasing Gold: నూతన సంవత్సరంలో బంగారం కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? అయితే కొనేముందు మోసపోకుండా ఉండేందుకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

బంగారం… మన దేశంలోదీనికి ఉన్న డిమాండ్ మరి ఏ వస్తువుకి కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు, ధర ఎంత పెరిగినా అంతే ఆసక్తితో కొంటునే ఉంటారు. మనం ఏ చిన్న ఫంక్షన్ అయినా లేక ఏ చిన్న పండుగ అయినా బంగారం కొంటూ ఉంటాం అయినా కూడా మనకి 22 క్యారెట్ల బంగారం అంటే ఏంటి? 24 క్యారెట్ల బంగారం అంటే ఏంటో తేడా అసలు తెలియదు. దీని గురించి, బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ముందుగా క్యారెట్ గురించి తెలుసుకుందాం క్యారెట్ అంటే ప్యూరిటీ ఆఫ్ గోల్డ్. అంటే బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో లెక్కిస్తారు.

24 క్యారెట్‌ బంగారంతో గోల్డ్‌ కాయిన్స్‌, గోల్డ్‌ బార్స్‌, గోల్డ్‌ బిస్కెట్స్‌ మాత్రమే తయారు చేస్తూ ఉంటారు. దీనిని 99.99% ప్యూర్ బంగారం అని కూడా అంటారు, ఇందులో ఎటువంటి లోహాలు (జింక్, కాపర్, సిల్వర్) ఉండవు. ఈ బంగారం మెత్తగా ఉండడం వలన ఆభరణాల కోసం ఉపయోగించారు. జ్యువెలరీ షాప్ లో ఎవరైనా అభరణాలు చూపించి ఇవి 24 క్యారెట్‌అని చెబితే నమ్మి మోసపోవద్దు. 24 క్యారెట్ల బంగారం కడ్డీల రూపంలో మాత్రమే ఉంటుంది. (చదవండి: Gold demand: 2024లో భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్.. 5 కారణాలు చెప్పిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ )

22 క్యారెట్ల బంగారం: మన దేశంలో ఆభరణాల తయారీకి ఎక్కువగా ఈ బంగారాన్ని ఉపయోగిస్తారు. ఇందులో 91.67శాతం స్వచ్ఛమైన బంగారం ఉండడం వలన దీనిని 916 బంగారం అని కూడా పిలుస్తారు. ఇందులో 8.33శాతం ఇతర లోహాలు అంటే జింక్, కాపర్, సిల్వర్, ఐరన్ ఉండడం వలన ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఇది ఆభరణాల తయారీకి అనువైంది. ఒకవేళ బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ బంగారం ఉత్తమమైనది.

ఇంకా మార్కెట్లో 18, 14 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. క్యారెట్‌ వాల్యూ తగ్గే కొద్ది బంగారం స్వచ్ఛత తగ్గి, ఇతర లోహాలు పెరుగుతూ ఉంటాయి. బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత సులువుగా బెండ్ అవుతుంది.

బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

>> ఏ షాపులో కొన్న బిల్లు కచ్చితంగా తీసుకోవాలి.
>> తూకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం తేడా వచ్చిన బిల్లు భారీగా పెరుగుతుంది.
>> రాళ్ల నగలు కొనేటప్పుడు రాళ్లు తీసి తూకం వేయమని డిమాండ్ చేయాలి.
>> ఆభరణంలో వీలైనంత తక్కువగా మజూరీ, తరుగు ఉండేలా చూసుకోవాలి.
>> 916 బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలనే కొనాలి.

షాప్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ల మోజులో పడి ఈ జాగ్రత్తలు మర్చిపోయారో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.