Gold discounts: ఎనిమిది నెలల్లో ఎన్నడూలేనంతగా భారీగా డిస్కౌంట్లు.. బంగారాన్ని ఇప్పుడు కొన్నారనుకో..

ధరలు తగ్గితేనే కొందామని కస్టమర్లు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని తెలిపారు.

Gold discounts: ఎనిమిది నెలల్లో ఎన్నడూలేనంతగా భారీగా డిస్కౌంట్లు.. బంగారాన్ని ఇప్పుడు కొన్నారనుకో..

Updated On : March 21, 2025 / 4:47 PM IST

దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో పసిడిని కొనాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా చాలా తక్కువ మంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో కస్టమర్లను ఆకర్షించడానికి బంగారం వ్యాపారులు భారీగా డిస్కౌంట్లు అందిస్తున్నారు. గత ఎనిమిది నెలల్లో ఎన్నడూ లేనంత డిస్కౌంట్‌ ఇప్పుడు బంగారం కొనుగోలుదాలకు అందుతోంది.

భారతీయ వ్యాపారులు దేశీయంగా ఉన్న ధరలపై ఔన్స్‌కు 41 డాలర్ల వరకు తగ్గింపు ధరకు బంగారాన్ని విక్రయిస్తున్నారు. గత వారం ఔన్స్‌కు 39 డాలర్ల వరకు డిస్కౌంట్‌ ఇచ్చారు. భారత్‌లో బంగారు ధరలు ఈ వారం ప్రారంభంలో 10 గ్రాములకు 89,796 రూపాయలకు పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 15 శాతానికి పైగా పెరిగాయి.

Also Read: కొత్తగా మూడు రూల్స్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. అవేంటంటే?

Gold

ధరలు స్థిరంగా పెరుగుతూనే ఉంటున్నాయని, ప్రతి వారం కొత్త గరిష్ఠాన్ని తాకుతున్నాయని ఢిల్లీలోని ఓ బులియన్ డీలర్ చెప్పారు. దీంతో ధరలు తగ్గితేనే కొందామని కస్టమర్లు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని తెలిపారు.

ఫిబ్రవరిలో భారత బంగారు దిగుమతులు గత సంవత్సరంతో పోలిస్తే 85 శాతం తగ్గాయి. ఇది 20 సంవత్సరాలలో అత్యల్ప స్థాయి. అంటే ఇండియా ఫిబ్రవరిలో ఇతర దేశాల నుంచి చాలా తక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. అధిక ధరలు, తక్కువ డిమాండ్ ఉండడమే ఇందుకు కారణం.

డిమాండ్ చాలా తక్కువగా ఉండడంతో డిస్కౌంట్లు ఇప్పటికీ పెరుగుతున్నాయని ముంబైకి చెందిన ఓ వ్యాపారి తెలిపారు. డిస్కౌంట్ల కారణంగా భారత్‌లో బంగారం ధరలు అంతర్జాతీయ ధరల కంటే తక్కువగా ఉన్నాయి. భారత్‌లో చాలా తక్కువ మంది ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది. ఇది స్థానిక మార్కెట్లో తక్కువ డిమాండ్‌కు దారితీస్తుంది.